Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 999

అద్భుత దేవుడు

Adbhuta Devudu

Open in Word & Worship App
తెలుగు   అద్భుత దేవుడు
పల్లవి
అద్భుత దేవుడు - ఆలోచన కర్త
ఆ యేసే మా దేవుడు - ఆశ్చర్యకరుడు - ఆశ్చర్యకరుడు
1)
నీటిని రసముగ మార్చినవాడు నీటి మీద నడచినవాడు
ఐదు రొట్టెలు రెండు చేపలు - ఐదు వేలకు పంచినవాడు
|| అద్భు ||
2)
కుంటికి కాళ్ళు నిచ్చినవాడు - గ్రుడ్డికి చూపునిచ్చినవాడు
మూగకు మాట నిచ్చినవాడు - కుష్ఠును స్వస్థపరచినవాడు
|| అద్భు ||
3)
మృతులకు జీవము నిచ్చినవాడు మృత్యువును జయించినవాడు
కృళ్ళిపోయిన లాజరు దేహము - సమాధి నుండి లేపినవాడు
|| అద్భు ||
4)
పాపులకొరకై వచ్చినవాడు - పాపులను ప్రేమించినవాడు
పాపికై ప్రాణమిచ్చినవాడు - పాపిని పరమున జేర్చెడివాడు
|| అద్భు ||
English   Adbhuta Devudu
Chorus
Adbhuta Devudu - Aalochana Karta
Aa Yese Maa Devudu - Aascharyakarudu - Aascharyakarudu
1)
Neetini Rasamuga Maarchinavaadu Neeti Meeda Nadachinavaadu
Aidu Rottelu Rendu Chepalu - Aidu Velaku Panchinavaadu
|| Adbhu ||
2)
Kuntiki Kaallu Nichchinavaadu - Gruddiki Choopunichchinavaadu
Moogaku Maata Nichchinavaadu - Kushthunu Svasthaparachinavaadu
|| Adbhu ||
3)
Mrtulaku Jeevamu Nichchinavaadu Mrtyuvunu Jayinchinavaadu
Krullipoyina Laajaru Dehamu - Samaadhi Nundi Lepinavaadu
|| Adbhu ||
4)
Paapulakorakai Vachchinavaadu - Paapulanu Preminchinavaadu
Paapikai Praanamichchinavaadu - Paapini Paramuna Jerchedivaadu
|| Adbhu ||
Present