Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 997

హే ప్రభు యేసు !

He Prabhu Yesu!

Open in Word & Worship App
తెలుగు   హే ప్రభు యేసు !
పల్లవి
హే ప్రభుయేసు - హే ప్రభుయేసు - హే ప్రభుదేవసుతా
సిల్వధరా పాపహరా శాంతికరా
1)
శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ
శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ
|| హే ప్రభు ||
2)
తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా
విఫలులు జేసిన విజ్ఞాపనలకు - సఫలత వీవెగదా
|| హే ప్రభు ||
3)
మతములు వెదకిన నిన్నెగదా - వ్రతములు గోరిన నిన్నెగదా
పతితులు దేవుని సుతులని నేర్పిన - హితమతి వీవెగదా
|| హే ప్రభు ||
4)
పలుకులలో నీ శాంతికథ - తొలకరి వానగ గురిసెగదా
మలమల మాడిన మానవహృదయము - కళకళలాడెకదా
|| హే ప్రభు ||
5)
కాననతుల్య సమాజములో - హీనల్‌ జెందెను మానవత
మానవ మైత్రిని సిల్వపతాకము - దానము జేసెగదా
|| హే ప్రభు ||
6)
దేవుని బాసిన లోకములో - చావుయె కాపురముండెగదా
దేవునితో సఖ్యంబును జగతికి - యీవి నిడితివి గదా
|| హే ప్రభు ||
7)
పాపముచేసిన స్త్రీనిగని - పాపులకోపము మండెగదా
దాపునజేరి పాపినిబ్రోచిన - కాపరి వీవెగదా
|| హే ప్రభు ||
8)
ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగజేసిన నీవెగదా
ఖలమయుడగు సాతానుని గర్వము - ఖండనమాయెగదా
|| హే ప్రభు ||
9)
కలువరిలో నీ శాంతి సుధా - సెలయేరుగ బ్రవహించెగదా
కలుష యెడారిలో కలువలు పూయుట - సిలువ విజయముగదా
|| హే ప్రభు ||
English   He Prabhu Yesu!
Chorus
He Prabhuyesu - He Prabhuyesu - He Prabhudevasutaa
Silvadharaa Paapaharaa Saantikaraa
1)
Saanti Samaadhaanaadhipatee - Svaantamulo Prasaantanidhee
Saanti Svaroopaa Jeevanadeepaa - Saanti Suvaartanidhee
|| He Prabhu ||
2)
Tapamulu Tarachina Ninnegadaa - Japamulu Golichina Ninnegadaa
Viphalulu Jesina Vignaapanalaku - Saphalata Veevegadaa
|| He Prabhu ||
3)
Matamulu Vedakina Ninnegadaa - Vratamulu Gorina Ninnegadaa
Patitulu Devuni Sutulani Nerpina - Hitamati Veevegadaa
|| He Prabhu ||
4)
Palukulalo Nee Saantikatha - Tolakari Vaanaga Gurisegadaa
Malamala Maadina Maanavahrudayamu - Kalakalalaadekadaa
|| He Prabhu ||
5)
Kaananatulya Samaajamulo - Heenal Jendenu Maanavata
Maanava Maitrini Silvapataakamu - Daanamu Jesegadaa
|| He Prabhu ||
6)
Devuni Baasina Lokamulo - Chaavuye Kaapuramundegadaa
Devunito Sakhyanbunu Jagatiki - Yeevi Niditivi Gadaa
|| He Prabhu ||
7)
Paapamuchesina Streenigani - Paapulakopamu Mandegadaa
Daapunajeri Paapinibrochina - Kaapari Veevegadaa
|| He Prabhu ||
8)
Khaalee Samaadhilo Maranamunu - Khaidigajesina Neevegadaa
Khalamayudagu Saataanuni Garvamu - Khandanamaayegadaa
|| He Prabhu ||
9)
Kaluvarilo Nee Saanti Sudhaa - Selayeruga Bravahinchegadaa
Kalusha Yedaarilo Kaluvalu Pooyuta - Siluva Vijayamugadaa
|| He Prabhu ||
Present