Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 99 Old No: 100

యోగ్యుడవే యోగ్యుడవే

Yogyudave Yogyudave

Open in Word & Worship App
తెలుగు   యోగ్యుడవే యోగ్యుడవే
పల్లవి
యోగ్యుడవో యోగ్యుడవో - యేసు ప్రభు నీవే యోగ్యుడవు
మరణము గెల్చిన యోధుడవో - నా జీవితమున పూజ్యుడవో
1)
సృష్టికర్తవు నిర్మాణకుడవు - జీవనదాత - జీవించువాడ
శిరమును వంచి కరములు జోడించి - స్తుతియించెదనిను
యేసుప్రభో
|| యోగ్యు ||
2)
గొఱ్ఱెపిల్లవై యాగమైతివి - సిలువయందే పాపమైతివి
శిరమునువంచి కరములు జోడించి - సేవించెద నిను
యేసుప్రభో
|| యోగ్యు ||
3)
నను విడిపించిన నావిమోచకా - విలువను చెల్లించి కడతేర్చినావా
శిరమును వంచి కరములు జోడించి - స్తోత్రించెద నిను
యేసుప్రభో
|| యోగ్యు ||
4)
స్నేహితుడవయి నను యిలకోరితివి - విడువకనన్ను ఆదుకొంటివి
శిరమును వంచి కరములు జోడించి స్తోత్రించెద నిను
యేసుప్రభో
|| యోగ్యు ||
English   Yogyudave Yogyudave
Chorus
Yogyudavo Yogyudavo - Yesu Prabhu Neeve Yogyudavu
Maranamu Gelchina Yodhudavo - Naa Jeevitamuna Poojyudavo
1)
Srushtikartavu Nirmaanakudavu - Jeevanadaata - Jeevinchuvaada
Siramunu Vanchi Karamulu Jodinchi - Sthuthiyinchedaninu
Yesuprabho
|| Yogyu ||
2)
Gorrepillavai Yaagamaitivi - Siluvayande Paapamaitivi
Siramunuvanchi Karamulu Jodinchi - Sevincheda Ninu
Yesuprabho
|| Yogyu ||
3)
Nanu Vidipinchina Naavimochakaa - Viluvanu Chellinchi Kadaterchinaavaa
Siramunu Vanchi Karamulu Jodinchi - Stotrincheda Ninu
Yesuprabho
|| Yogyu ||
4)
Snehitudavayi Nanu Yilakoritivi - Viduvakanannu Aadukontivi
Siramunu Vanchi Karamulu Jodinchi Stotrincheda Ninu
Yesuprabho
|| Yogyu ||
Present