Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 986

మారుమనస్సు నొందని

Maarumanassu Nondani

Open in Word & Worship App
తెలుగు   మారుమనస్సు నొందని
పల్లవి
మారుమనస్సునొందని ఓ మానవుడా
ఆ అంత్య తీర్పులో తప్పించుకొందువా
జాగేలనో ఓ సోదరా ఇకను జాగేలనో ఓ సోదరి
1)
మరువకు నీ పాపఫలం నిత్యాగ్ని గుండము
మురిసి పోకు క్షణికమైన పాపమునందు
దాచి యున్న దాగదు నీ ఘోర పాపము
బయలుపడును ఒక దినము నీ హృదయరహస్యము
|| జాగే ||
2)
మార్పునొందని నీ హృదయ కాఠిన్యముతో
దేవుని ఉగ్రతను సమకూర్చుకొందువా?
ధవళాధిపతి యేసే తీర్పు తీర్చు దినమున
ఆరని నరకాగ్నిలో త్రోసి వేయబడుదువు
|| జాగే ||
3)
నీ ఘోరపాపశిక్ష యేసే భరియించెను
సిలువలో మరణించి తిరిగి లేచెను
నేడే విశ్వసించి మారుమనస్సు పొందుమా
శిక్ష నుండి తొలగి రక్షింపబడెదవు
|| జాగే ||
English   Maarumanassu Nondani
Chorus
Maarumanassunondani O Maanavudaa
Aa Antya Teerpulo Tappinchukonduvaa
Jaagelano O Sodaraa Ikanu Jaagelano O Sodari
1)
Maruvaku Nee Paapaphalan Nityaagni Gundamu
Murisi Poku Kshanikamaina Paapamunandu
Daachi Yunna Daagadu Nee Ghora Paapamu
Bayalupadunu Oka Dinamu Nee Hrudayarahasyamu
|| Jaage ||
2)
Maarpunondani Nee Hrudaya Kaathinyamuto
Devuni Ugratanu Samakoorchukonduvaa?
Dhavalaadhipati Yese Teerpu Teerchu Dinamuna
Aarani Narakaagnilo Trosi Veyabaduduvu
|| Jaage ||
3)
Nee Ghorapaapasiksha Yese Bhariyinchenu
Siluvalo Maraninchi Tirigi Lechenu
Nede Visvasinchi Maarumanassu Pondumaa
Siksha Nundi Tolagi Rakshinpabadedavu
|| Jaage ||
Present