Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 982

యేసుక్రీస్తు బోధ నీవు

Yesukreestu Bodha Neevu

Open in Word & Worship App
తెలుగు   యేసుక్రీస్తు బోధ నీవు
పల్లవి
యేసుక్రీస్తు బోధ నీవు నమ్మవా! నీదు పాపముల నుండి
తొలగవా? నిత్య నరకాగ్ని కోరుకొందువా ?
1)
ఇదిగో త్వరగ వత్తునంచు యేసు చెప్పగా - నీ హృదయ
ద్వారమందు తట్టుచుండగా - లెక్కచేయనట్టి నీకు శిక్ష
తప్పిపోవునా? రక్షనొంద గోరు మిదే సమయము
|| యే ||
2)
నోవహు దినములందు జరగినట్లుగ - ఆ లోతు దినములందు
జరిగినట్లుగా - అట్లు మనుజ కుమారుని దినములందు
జరుగును దినములన్ని చెడ్డవంచు నమ్ముమా!
|| యే ||
3)
నీవు మారుమనస్సు నొంద గోరుచు దినమంత - యేసు చేయి
జాచుచు ఘోర మరణమొంది తన రక్తమంత కార్చగా
శుద్ధి పడక త్రొక్కి పోవ తలతువా!
|| యే ||
4)
క్రొత్త జన్మ మెత్తక యే మత భక్తితో - నీవెత్త బడవు నిజము
పరము యేసుతో - యేసు నిన్ను యెరుగక యేసు పేరు పిలచిన
యేసు రాజ్యమందు చేరబోదువా!
|| యే ||
English   Yesukreestu Bodha Neevu
Chorus
Yesukreestu Bodha Neevu Nammavaa! Needu Paapamula Nundi
Tolagavaa? Nitya Narakaagni Korukonduvaa ?
1)
Idigo Tvaraga Vattunanchu Yesu Cheppagaa - Nee Hrudaya
Dvaaramandu Tattuchundagaa - Lekkacheyanatti Neeku Siksha
Tappipovunaa? Rakshanonda Goru Mide Samayamu
|| Ye ||
2)
Novahu Dinamulandu Jaraginatluga - Aa Lotu Dinamulandu
Jariginatlugaa - Atlu Manuja Kumaaruni Dinamulandu
Jarugunu Dinamulanni Cheddavanchu Nammumaa!
|| Ye ||
3)
Neevu Maarumanassu Nonda Goruchu Dinamanta - Yesu Cheyi
Jaachuchu Ghora Maranamondi Tana Raktamanta Kaarchagaa
Suddhi Padaka Trokki Pova Talatuvaa!
|| Ye ||
4)
Krotta Janma Mettaka Ye Mata Bhaktito - Neevetta Badavu Nijamu
Paramu Yesuto - Yesu Ninnu Yerugaka Yesu Peru Pilachina
Yesu Raajyamandu Cheraboduvaa!
|| Ye ||
Present