Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 981

పరలోకమున చేరను రండి

Paralokamuna Cheranu Randi

Open in Word & Worship App
తెలుగు   పరలోకమున చేరను రండి
పల్లవి
పరలోకమున చేరను రండి - పరమానందం పొందనురండి
పరలోకములో పాపము లేదుగా - నిరంతరము పరమానందమె
1)
పరిశుద్ధుడగు శ్రీ యేసుండె పరిశుద్ధులతో కెరూబులతో
నిరంతరము స్తుతింపబడు - పరలోకములో చేరను రండీ
|| పర ||
2)
సంగీతముతో సంతోషముతో నాలుగు జీవులు వీణెలు మీటగ
ఇరువది నలుగురు పెద్దలందరు - యేసుని యెదుట సాగిలపడిరి
|| పర ||
3)
నాలుగు జీవుల పెద్దల మధ్యలో వధింపబడిన యేసుని చూడుడీ
ఆయన రుధిరం అన్ని జాతుల - మనుజుల గొనెను, మహిమ నొందెను
|| పర ||
4)
కరువులుండవు కష్టాలుండవు - ఈతి బాధలు సముద్రముండదు
మరణము లేదు దుఃఖము లేదు - నిరంతరము పరమానందమే
|| పర ||
5)
ఆకలిదప్పులు ఎండమావులు ఆలోకములో ఉండనె ఉండవు
సూర్యుడు చంద్రుడు చుక్కలుండవు - శ్రీ యేసుండే ప్రకాశించును
|| పర ||
6)
జీవ జలముల్‌ త్రాగను రండీ! జీవ వృక్షపు పండ్లను తినుడి
రత్నములు సువర్ణముతో కట్టిన పట్టణం ప్రవేశించుడి
|| పర ||
7)
ఏడు వందల ఏబది క్రోసుల్‌ ఎత్తుగలది ఆ పట్టణము
ఎత్తును పొడువు వెడల్పును - అంతా సమమె సువర్ణముతో
|| పర ||
English   Paralokamuna Cheranu Randi
Chorus
Paralokamuna Cheranu Randi - Paramaanandan Pondanurandi
Paralokamulo Paapamu Ledugaa - Nirantaramu Paramaanandame
1)
Parisuddhudagu Sree Yesunde Parisuddhulato Keroobulato
Nirantaramu Sthuthinpabadu - Paralokamulo Cheranu Randee
|| Para ||
2)
Sangeetamuto Santoshamuto Naalugu Jeevulu Veenelu Meetaga
Iruvadi Naluguru Peddalandaru - Yesuni Yeduta Saagilapadiri
|| Para ||
3)
Naalugu Jeevula Peddala Madhyalo Vadhinpabadina Yesuni Choodudee
Aayana Rudhiran Anni Jaatula - Manujula Gonenu, Mahima Nondenu
|| Para ||
4)
Karuvulundavu Kashtaalundavu - Eeti Baadhalu Samudramundadu
Maranamu Ledu DuHkhamu Ledu - Nirantaramu Paramaanandame
|| Para ||
5)
Aakalidappulu Endamaavulu Aalokamulo Undane Undavu
Sooryudu Chandrudu Chukkalundavu - Sree Yesunde Prakaasinchunu
|| Para ||
6)
Jeeva Jalamul Traaganu Randee! Jeeva Vrukshapu Pandlanu Tinudi
Ratnamulu Suvarnamuto Kattina Pattanan Pravesinchudi
|| Para ||
7)
edu Vandala ebadi Krosul Ettugaladi Aa Pattanamu
Ettunu Poduvu Vedalpunu - Antaa Samame Suvarnamuto
|| Para ||
Present