Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 98 Old No: 16

సాగిలపడి మొక్కెదము

Saagilapadi Mokkedamu

Open in Word & Worship App
తెలుగు   సాగిలపడి మొక్కెదము
పల్లవి
సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో
ఆత్మతో మన ప్రభు యేసుని - ఆ ఆ ఆ
1)
మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములనుండి విడిపించున్‌
వేషధారులను - ద్వేషించున్‌ - ఆశతో మ్రొక్కెదము
|| సా ||
2)
అహరోనుకంటె శ్రేష్ఠుడు మన - ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు - అందరము మ్రొక్కెదము
|| సా ||
3)
ఆలయముకన్న శ్రేష్ఠుడు - నిజ ఆలయముగ తానేయుండెన్‌
ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము
|| సా ||
4)
సొలొమోనుకన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతిప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము
|| సా ||
5)
రాజులకంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను జేసెన్‌
రారాజుగ త్వరలో వచ్చున్‌ - రయముగను మ్రొక్కెదము
|| సా ||
6)
అందరిలో అతిశ్రేష్ఠుడు - మన - కందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము
|| సా ||
English   Saagilapadi Mokkedamu
Chorus
Saagilapadi Mrokkedamu - Satyamuto
Aatmato Mana Prabhu Yesuni - Aa Aa Aa
1)
Moshe Kante Sreshthudu Anni Mosamulanundi Vidipinchun
Veshadhaarulanu - Dveshinchun - Aasato Mrokkedamu
|| Saa ||
2)
Aharonukante Sreshthudu Mana - Aaraadhanaku Paatrundu
Aayane Pradhaana Yaajakudu - Andaramu Mrokkedamu
|| Saa ||
3)
Aalayamukanna Sreshthudu - Nija Aalayamuga Taaneyunden
Aalayamu Meere Yanenu - Ellakaalamu Mrokkedamu
|| Saa ||
4)
Solomonukanna Sreshthudu - Sarvagnaanamunaku Aadhaarundu
Padivelalo Atipriyundu - Padilamugaa Mrokkedamu
|| Saa ||
5)
Raajulakante Sreshthudu - Yaajakulanugaa Manalanu Jesen
Raaraajuga Tvaralo Vachchun - Rayamuganu Mrokkedamu
|| Saa ||
6)
Andarilo Atisreshthudu - Mana - Kandariki Taane Prabhuvu
Hallelooyaku Paatrundu - Anudinamu Mrokkedamu
|| Saa ||
Present