Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 977 Old No: 888

ప్రజలారా వినరండి

Prajalaaraa Vinarandi

Open in Word & Worship App
తెలుగు   ప్రజలారా వినరండి
పల్లవి
ప్రజలారా వినరండి ఈ శుభవార్త ప్రజలారా వినరండి ప్రభు సువార్త
ప్రభుయేసే లోకానికి రక్షకుండని ప్రథమముగా నమ్మండి
యేసుప్రభువని పరలోక రక్షణకై పరుగిడుతూ రారండి
1)
స్థలమనుచు మతమనుచు జాగుచేయకు కుండలు వేర్వేరైనా మట్టి ఒక్కటే
స్థిరము కానిదానికై ప్రాకులాడకు స్థిరమైనది పరలోక రాజ్యమొక్కటే
స్థిర రాజ్యం చేరుటకు ప్రభుయేసు మార్గమొక్కటే
|| ప్రజ ||
2)
నరుడా మన ఆయువు ఆవిరి వంటిది వీడిపోయిన ఆత్మ మరల తిరిగి రానిది
నరులాలోచన పాపసహితమైనది అటువంటి వారికై నరకమున్నది
నరకములో సోదర అగ్ని ఆరదు పురుగు చావదు
|| ప్రజ ||
3)
ఏ మనుష్యుడు నీతిమంతుడు కాదు మన నీతి ప్రభు దృష్టికి మురికి గుడ్డలు
ఏ క్రియల మూలముగా నీతి కలుగదు మన కొరకై ప్రభు కార్చెను రక్తధారలు
యేసుని రక్తము కడిగి వేయును పాప మరకలు
|| ప్రజ ||
English   Prajalaaraa Vinarandi
Chorus
Prajalaaraa Vinarandi Ee Subhavaarta Prajalaaraa Vinarandi Prabhu Suvaarta
Prabhuyese Lokaaniki Rakshakundani Prathamamugaa Nammandi
Yesuprabhuvani Paraloka Rakshanakai Parugidutoo Raarandi
1)
Sthalamanuchu Matamanuchu Jaagucheyaku Kundalu Ververainaa Matti Okkate
Sthiramu Kaanidaanikai Praakulaadaku Sthiramainadi Paraloka Raajyamokkate
Sthira Raajyan Cherutaku Prabhuyesu Maargamokkate
|| Praja ||
2)
Narudaa Mana Aayuvu Aaviri Vantidi Veedipoyina Aatma Marala Tirigi Raanidi
Narulaalochana Paapasahitamainadi Atuvanti Vaarikai Narakamunnadi
Narakamulo Sodara Agni Aaradu Purugu Chaavadu
|| Praja ||
3)
e Manushyudu Neetimantudu Kaadu Mana Neeti Prabhu Drushtiki Muriki Guddalu
e Kriyala Moolamugaa Neeti Kalugadu Mana Korakai Prabhu Kaarchenu Raktadhaaralu
Yesuni Raktamu Kadigi Veyunu Paapa Marakalu
|| Praja ||
Present