Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 975 Old No: 860

పాపిగానే జేవింతువా

Paapigane Jevintuvaa

Open in Word & Worship App
తెలుగు   పాపిగానే జేవింతువా
పల్లవి
పాపిగానే జీవింతువా పాపమునందే మరణింతువా
ప్రియుడా... ప్రభుని ప్రేమను గుర్తింపవా
1)
ఆశలు నిండిన లోకమునందు - ఆశలు ఎన్నో ఉండునుగా
అది నాశనమునకే నడుపునుగా - ఆశలు తెంచి ప్రేమను పెంచి
ప్రభుని పథమున నడువుమా? ప్రియుడా
|| పాపి ||
2)
లోకము నీదికాదని తెలిసి తెలిసిన - నీవు తెలియకుందువా
విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి
నరకావేదన కలదోయి ప్రియుడా
|| పాపి ||
3)
విన్నబోధ యిది నాది కాదని - నిర్లక్ష్యముగా వెడలెదవా
నీవు మారుమనస్సు నొందవా - రేపు యనెడి రోజునందు
మరణము సంధించగా మోక్షమార్గము ఇక లేదుగా ప్రియుడా
|| పాపి ||
4)
పాపము వలన శాపము కలిగెను - శాపము వలన మరణము కలిగెను
మరణపు ముల్లు విరిచిన యేసు
పాపివైన నీ కోసము ప్రభువు సిలువ పొందెనుగా ప్రియుడ
|| పాపి ||
5)
నీదు జీవితము స్థిరముకాదని - యాత్రికుండవని మరచిపోతివా
నేడే గమ్యము ఏదో తెలుసా
తెలియక పోయినచో - నీకు నరకము తప్పదుగా ప్రియుడా
|| పాపి ||
English   Paapigane Jevintuvaa
Chorus
Paapigaane Jeevintuvaa Paapamunande Maranintuvaa
Priyudaa... Prabhuni Premanu Gurtinpavaa
1)
Aasalu Nindina Lokamunandu - Aasalu Enno Undunugaa
Adi Naasanamunake Nadupunugaa - Aasalu Tenchi Premanu Penchi
Prabhuni Pathamuna Naduvumaa? Priyudaa
|| Paapi ||
2)
Lokamu Needikaadani Telisi Telisina - Neevu Teliyakunduvaa
Vidudala Leni Jeevitamunaku Vedana Kaladoyi
Narakaavedana Kaladoyi Priyudaa
|| Paapi ||
3)
Vinnabodha Yidi Naadi Kaadani - Nirlakshyamugaa Vedaledavaa
Neevu Maarumanassu Nondavaa - Repu Yanedi Rojunandu
Maranamu Sandhinchagaa Mokshamaargamu Ika Ledugaa Priyudaa
|| Paapi ||
4)
Paapamu Valana Saapamu Kaligenu - Saapamu Valana Maranamu Kaligenu
Maranapu Mullu Virichina Yesu
Paapivaina Nee Kosamu Prabhuvu Siluva Pondenugaa Priyuda
|| Paapi ||
5)
Needu Jeevitamu Sthiramukaadani - Yaatrikundavani Marachipotivaa
Nede Gamyamu edo Telusaa
Teliyaka Poyinacho - Neeku Narakamu Tappadugaa Priyudaa
|| Paapi ||
Present