Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 974 Old No: 848

అదే అదే ఆ రోజ

Ade Ade Aa Roja

Open in Word & Worship App
తెలుగు   అదే అదే ఆ రోజ
పల్లవి
అదే అదే ఆ రోజు - యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు - పాపులంత ఏడ్చెరోజు
1)
సూర్యుడు నలుపయ్యే రోజు - చంద్రుడు ఎరుపయ్యే రోజు
భూకంపము కల్గె రోజు - దిక్కులేక అరచే రోజు
ఆ రోజు శ్రమలనుండి - తప్పించే నాధుడు లేడు
|| అదే ||
2)
మిడతల దండొచ్చె రోజు - నీరు రక్తమయ్యె రోజు
కోపాగ్ని రగిలే రోజు - పర్వతములు పగిలే రోజు
|| అదే ||
3)
వ్యభిచారులు ఏడ్చే రోజు - మోసగాండ్రు మసలే రోజు
అబద్దికులు అరచే రోజు - దొంగలంత దొర్లె రోజు
|| అదే ||
4)
పిల్లజాడ తల్లికి లేక - తల్లి జాడ పిల్లకు రాక
చెట్టుకొకరు పుట్ట కొక్కరై - అనాథలై అరచే రోజు
|| అదే ||
5)
వంగని కాల్లోంగే రోజు - ఏడ్వని వారేడ్చే రోజు
ఎరుగని వారెరిగే రోజు - గుండె పగిలి ఏడ్చె రోజు
|| అదే ||
6)
రొమ్ము కొట్టుకునే రోజు - గుండె బాదుకొనే రోజు
ఏడ్వని వారేడ్చె రోజు - ఎరుగని వారెరిగే రోజు
|| అదే ||
7)
ఓ మనిషి యోచించవా - నీ బ్రతుకు ఏలావున్నదో
ఓ పాపి యోచింపవా - నీ జీవితమెలా ఉన్నదో
బలము చూచి భంగపడకుమా
ధనము చూచి ధగాపడకుమా
|| అదే ||
English   Ade Ade Aa Roja
Chorus
Ade Ade Aa Roju - Yesayya Ugrata Roju
edendla Sramala Roju - Paapulanta edcheroju
1)
Sooryudu Nalupayye Roju - Chandrudu Erupayye Roju
Bhookanpamu Kalge Roju - Dikkuleka Arache Roju
Aa Roju Sramalanundi - Tappinche Naadhudu Ledu
|| Ade ||
2)
Midatala Dandochche Roju - Neeru Raktamayye Roju
Kopaagni Ragile Roju - Parvatamulu Pagile Roju
|| Ade ||
3)
Vyabhichaarulu edche Roju - Mosagaandru Masale Roju
Abaddikulu Arache Roju - Dongalanta Dorle Roju
|| Ade ||
4)
Pillajaada Talliki Leka - Talli Jaada Pillaku Raaka
Chettukokaru Putta Kokkarai - Anaathalai Arache Roju
|| Ade ||
5)
Vangani Kaallonge Roju - edvani Vaaredche Roju
Erugani Vaarerige Roju - Gunde Pagili edche Roju
|| Ade ||
6)
Rommu Kottukune Roju - Gunde Baadukone Roju
edvani Vaaredche Roju - Erugani Vaarerige Roju
|| Ade ||
7)
O Manishi Yochinchavaa - Nee Bratuku elaavunnado
O Paapi Yochinpavaa - Nee Jeevitamelaa Unnado
Balamu Choochi Bhangapadakumaa
Dhanamu Choochi Dhagaapadakumaa
|| Ade ||
Present