Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 97 Old No: 15

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా

Naa Praana Priyudaa Yesu Raajaa

Open in Word & Worship App
తెలుగు   నా ప్రాణ ప్రియుడా యేసు రాజా
పల్లవి
నా ప్రాణప్రియుడా యేసురాజా! అర్పింతును నా హృదయార్పణ
విరిగినలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
1)
అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా!
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా! స్తుతియించెదన్‌
|| నా ||
2)
విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి - ఆరాధింతున్‌ - హర్షింతును
నే పాడెదను నా ప్రభువా
|| నా ||
3)
గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరుచునా ?
మరచినగాని నీవెన్నడు - మరువవు విడువవు
ఎడబాయవు కరుణా రాజా
|| నా ||
4)
రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్‌
రక్షకుడా నాకొసగితివి - దీక్షతో నిన్నువీక్షించుచు - స్తుతియింతును
|| నా ||
5)
నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతాస్తుతుల తోడ - నీ ప్రేమను నే వివరింతును విమోచకా
|| నా ||
6)
వాగ్దానములు నాలో నెరవేరను - విమోచించి నాకిచ్చితివి
పాడెదను ప్రహర్షింతును - హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయ
|| నా ||
English   Naa Praana Priyudaa Yesu Raajaa
Chorus
Naa Praanapriyudaa Yesuraajaa! Arpintunu Naa Hrudayaarpana
Viriginaligina Aatmatonu Hrudayapoorvaka Aaraadhanato Satyamugaa
1)
Adbhutakarudaa Aalochana - Aascharya Samaadhaana Prabhuvaa!
Balavantudaa Bahupriyudaa
Manoharudaa Mahimaraajaa! Sthuthiyinchedan
|| Naa ||
2)
Vimochana Gaanamulato - Saundarya Prema Stutulato
Namaskarinchi - Aaraadhintun - Harshintunu
Ne Paadedanu Naa Prabhuvaa
|| Naa ||
3)
Garbhamuna Puttina Biddanu - Karuninpaka Talli Maruchunaa ?
Marachinagaani Neevennadu - Maruvavu Viduvavu
Edabaayavu Karunaa Raajaa
|| Naa ||
4)
Rakshanaalankaaramulanu - Akshayamagu Nee Yaahaaramun
Rakshakudaa Naakosagitivi - Deekshato Ninnuveekshinchuchu - Sthuthiyintunu
|| Naa ||
5)
Nee Neetini Nee Rakshananu - Naa Pedavulu Prakatinchunu
Krutagnaataastutula Toda - Nee Premanu Ne Vivarintunu Vimochakaa
|| Naa ||
6)
Vaagdaanamulu Naalo Neraveranu - Vimochinchi Naakichchitivi
Paadedanu Praharshintunu - Hallelooya Hallelooyaa Hallelooya
|| Naa ||
Present