Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 964 Old No: 775

వినరండి శుభవార్త

Vinarandi Shubhavaarta

Open in Word & Worship App
తెలుగు   వినరండి శుభవార్త
పల్లవి
వినరండీ! శుభవార్త! ఘనుడేసుని రక్షణ వార్త!
హితమతితో వినువారే ఘన రక్షణ నొందెదరు
1)
భూలోక వాసులకు రక్షణ గోరు పాపులకు - అక్షయుడేసుని
రక్తమెగ పాపక్షమాపణ హేతువని
|| విన ||
2)
ఓ పాపి! రేపేమి సంభవించుట ఎరుగుదువా? అతిశయమొందుట ఏలనిక,
ఆపద తొలగును వేడుమిక
|| విన ||
3)
రారండీ! రారండీ! రక్షకుడేసుని జేరండీ - అక్షయ జీవము
మికిచ్చున్‌ అనిశము ఆనందమె కలుగున్‌
|| విన ||
4)
అదిగదిగో కల్వరిలో వధయైపోయిన యేసుండే - పాపుల భారము
మోసెనని నమ్మిన నెమ్మది కల్గునిక
|| విన ||
5)
ఈనాడే ఉచితముగ రక్షణ గోరిన దొరుకునుగ - తరుణము
దాటిన రాదుగదా! త్వరపడి ప్రార్థన జేయుమిక
|| విన ||
6)
పాపులకై ప్రభుయేసు మృతుడై బ్రతికిన వార్తయిదె
నమ్మిన వారికి నెమ్మదియున్‌ నమ్మని వారికి నరకమయ
|| విన ||
7)
పరలోకం భూలోకం పాలించెడు శ్రీయేసుండే
రాజులరాజు రక్షకుడు యుగాయుగాలకు దేవుండు
|| విన ||
English   Vinarandi Shubhavaarta
Chorus
Vinarandee! Subhavaarta! Ghanudesuni Rakshana Vaarta!
Hitamatito Vinuvaare Ghana Rakshana Nondedaru
1)
Bhooloka Vaasulaku Rakshana Goru Paapulaku - Akshayudesuni
Raktamega Paapakshamaapana Hetuvani
|| Vina ||
2)
O Paapi! Repemi Sanbhavinchuta Eruguduvaa? Atisayamonduta elanika,
Aapada Tolagunu Vedumika
|| Vina ||
3)
Raarandee! Raarandee! Rakshakudesuni Jerandee - Akshaya Jeevamu
Mikichchun Anisamu Aanandame Kalugun
|| Vina ||
4)
Adigadigo Kalvarilo Vadhayaipoyina Yesunde - Paapula Bhaaramu
Mosenani Nammina Nemmadi Kalgunika
|| Vina ||
5)
Eenaade Uchitamuga Rakshana Gorina Dorukunuga - Tarunamu
Daatina Raadugadaa! Tvarapadi Praarthana Jeyumika
|| Vina ||
6)
Paapulakai Prabhuyesu Mrtudai Bratikina Vaartayide
Nammina Vaariki Nemmadiyun Nammani Vaariki Narakamaya
|| Vina ||
7)
Paralokan Bhoolokan Paalinchedu Sreeyesunde
Raajularaaju Rakshakudu Yugaayugaalaku Devundu
|| Vina ||
Present