Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 963 Old No: 756

సర్వజనులారా ఆలకించడి

Sarvajanulaaraa Aalakinchadi

Open in Word & Worship App
తెలుగు   సర్వజనులారా ఆలకించడి
పల్లవి
సర్వజనులారా - ఆలకించండి - సర్వలోక రక్షకుడు శ్రీయేసేను
1)
భేదమేమిలేనేలేదండి - ధరను అందరు పాపము చేశారండి - దేవుని
ప్రేమను నిర్లక్ష్యపెట్టి దివ్యమైన మహిమకు దూరమైతిరండి
2)
స్వనీతి క్రియలను చేయుచును - నీతిమంతులని మురి యొద్దండి మనదు
క్రియలన్నియు మురికి గుడ్డలండి - ముక్తిదాత యేసుని ముదముగ నమ్మండి
3)
పాపులకై బలియయ్యాడండి - ఆయన పాపమేమి ఎరుగడు సుమ్మండి
పరమ పవిత్రుడు పాపమును గెల్చి మృత్యుంజయుడై మరియు దివికేగెనండి
4)
యేసు వచ్చె సమయమాయెనండి - బహు సూచనలు జరుగుచున్న వండి -
దోషములు బాపియు దీవెనలనిచ్చెడి ఆ యేసుని నమ్మి
రక్షణ పొందండి
5)
బుడగలాంటి బ్రతుకు మనదండి - అది చిటికెలోన చితికి పోవునండి
అల్పకాల పాపపు భోగమె ఈ లోకము - నిత్యరాజ్యమిచ్చెడి యేసుని నమ్మండి
English   Sarvajanulaaraa Aalakinchadi
Chorus
Sarvajanulaaraa - Aalakinchandi - Sarvaloka Rakshakudu Sreeyesenu
1)
Bhedamemileneledandi - Dharanu Andaru Paapamu Chesaarandi - Devuni
Premanu Nirlakshyapetti Divyamaina Mahimaku Dooramaitirandi
2)
Svaneeti Kriyalanu Cheyuchunu - Neetimantulani Muri Yoddandi Manadu
Kriyalanniyu Muriki Guddalandi - Muktidaata Yesuni Mudamuga Nammandi
3)
Paapulakai Baliyayyaadandi - Aayana Paapamemi Erugadu Summandi
Parama Pavitrudu Paapamunu Gelchi Mrtyunjayudai Mariyu Divikegenandi
4)
Yesu Vachche Samayamaayenandi - Bahu Soochanalu Jaruguchunna Vandi -
Doshamulu Baapiyu Deevenalanichchedi Aa Yesuni Nammi
Rakshana Pondandi
5)
Budagalaanti Bratuku Manadandi - Adi Chitikelona Chitiki Povunandi
Alpakaala Paapapu Bhogame Ee Lokamu - Nityaraajyamichchedi Yesuni Nammandi
Present