Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 956 Old No: 687

త్వరగా వస్తాడు యేసయ్య

Tvaraga Vastaadu Yesayya

Open in Word & Worship App
తెలుగు   త్వరగా వస్తాడు యేసయ్య
పల్లవి
త్వరగా వస్తాడు యేసయ్య - తరుణము నీకిక లేదయ్య
కృపాకాలం దాటిపోతే, కఠిన శ్రమలే ఎదురౌను
రేపు అన్నది నీది కాదు - రక్షణొందుము నేడే నీవు
రక్షణొందుము నేడే నీవు
1)
కరుణమూర్తియై వచ్చెన్‌ మొదటిసారి - మహోగ్రుడై వచ్చున్‌
రెండవసారి - యుదాగోత్రపు సింహమై తీర్పుచేయ
దిగివచ్చున్‌ - రాజులు, రణధీరులు భూప్రజలందరు
భయపడి వణికెదరు - తాళగలవా తీర్పును, ఓర్వగలవా
ఉగ్రతను, ఓర్చగలవా ఉగ్రతను
|| త్వరగా ||
2)
సృష్టిలయమై పోవును ఉగ్రత దినమందు - భూమి
దద్దరిల్లుచూ స్థానము తప్పగా - అయ్యో, అయ్యో, శ్రమయనుచూ
గుండె బాదుచూ ఏడ్చినా, దొరకదు నీ కాశ్రయం ఎందుబోయినా
దుఃఖమే సుమా! ప్రభుని నమ్ముము ఈ దినమే తొలగి
పోవును ఆ ప్రళయం ! తొలగిపోవును ఆ ప్రళయం
|| త్వరగా ||
English   Tvaraga Vastaadu Yesayya
Chorus
Tvaragaa Vastaadu Yesayya - Tarunamu Neekika Ledayya
Krupaakaalan Daatipote, Kathina Sramale Eduraunu
Repu Annadi Needi Kaadu - Rakshanondumu Nede Neevu
Rakshanondumu Nede Neevu
1)
Karunamoortiyai Vachchen Modatisaari - Mahogrudai Vachchun
Rendavasaari - Yudaagotrapu Sinhamai Teerpucheya
Digivachchun - Raajulu, Ranadheerulu Bhooprajalandaru
Bhayapadi Vanikedaru - Taalagalavaa Teerpunu, Orvagalavaa
Ugratanu, Orchagalavaa Ugratanu
|| Tvaragaa ||
2)
Srushtilayamai Povunu Ugrata Dinamandu - Bhoomi
Daddarilluchoo Sthaanamu Tappagaa - Ayyo, Ayyo, Sramayanuchoo
Gunde Baaduchoo edchinaa, Dorakadu Nee Kaasrayan Enduboyinaa
DuHkhame Sumaa! Prabhuni Nammumu Ee Diname Tolagi
Povunu Aa Pralayan ! Tolagipovunu Aa Pralayan
|| Tvaragaa ||
Present