తెలుగు కల్వారిలో నీకోసమే
పల్లవికల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభూ
కనులార వీక్షించవా మనసార యోచించవా? - 2
నిలువెల్ల శ్రమనొంది విలపించెను - తపియించి కనుమూసెను - 2
1)ప్రభునందు పాపము లేదుగా - ప్రభునోట కపటము లేదుగా - 2
పాపము ఎరుగడుగా పావన చరితుడుగా - 2
నీ పాపములకై అరుదెంచె ఇలలో భరియించె నీ శిక్షను
|| కల్వరి ||
2)ముళ్ళ మకుటము కొట్టిరి - కొరడాలతో దేహము చీల్చిరి - 2
మోపిరి భారమును ఊసిరి నీచముగా - 2
స్రవియించి రక్తంబు ప్రవహించెను - నా పాపము కడుగుటకై-2
|| కల్వరి ||
3)మరణించెను యేసు ప్రభూ కంపించెను ధర దివి సూర్యుడు 2
సాతానుని ఓడించె సమాధిని జయించెను - 2
పరలోకమున కేగెను యేసు ప్రభు - సిద్ధపరచె నిత్యజీవము - 2
|| కల్వరి ||
4)నమ్మక దాటి పోయెదవా - నరకాగ్ని గుండము చేరెదవా ! - 2
ఎలాగు సహియింతువు ఎంతెంతో గానో ప్రలాపింతువు
ఇప్పుడైనా నమ్ముము ప్రభు యేసుని పరలోకము నిను చేర్చును- 2
|| కల్వరి ||
English Kalvaarilo Neekosame
ChorusKalvarilo Nee Kosame Baliyaayenu Yesu Prabhoo
Kanulaara Veekshinchavaa Manasaara Yochinchavaa? - 2
Niluvella Sramanondi Vilapinchenu - Tapiyinchi Kanumoosenu - 2
1)Prabhunandu Paapamu Ledugaa - Prabhunota Kapatamu Ledugaa - 2
Paapamu Erugadugaa Paavana Charitudugaa - 2
Nee Paapamulakai Arudenche Ilalo Bhariyinche Nee Sikshanu
|| Kalvari ||
2)Mulla Makutamu Kottiri - Koradaalato Dehamu Cheelchiri - 2
Mopiri Bhaaramunu Oosiri Neechamugaa - 2
Sraviyinchi Raktanbu Pravahinchenu - Naa Paapamu Kadugutakai-2
|| Kalvari ||
3)Maraninchenu Yesu Prabhoo Kanpinchenu Dhara Divi Sooryudu 2
Saataanuni Odinche Samaadhini Jayinchenu - 2
Paralokamuna Kegenu Yesu Prabhu - Sidhaparache Nityajeevamu - 2
|| Kalvari ||
4)Nammaka Daati Poyedavaa - Narakaagni Gundamu Cheredavaa ! - 2
Elaagu Sahiyintuvu Entento Gaano Pralaapintuvu
Ippudainaa Nammumu Prabhu Yesuni Paralokamu Ninu Cherchunu- 2
|| Kalvari ||