Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 942 Old No: 594

నేడు నీవు యేసుని మాట

Needu Neevu Yesuni Maata

Open in Word & Worship App
తెలుగు   నేడు నీవు యేసుని మాట
పల్లవి
నేడు నీవు యేసునిమాట వినినచో
నీ హృదయమును కఠినపరచుకొనకుము
1)
దేవుని మాటలు - జీవపు ఊటలు
మధురము - మహానందదాయకము
నీటివంటిది - తేనెకన్న మధురం
జీవితమునకు వెలుగైయున్నది
|| నేడు ||
2)
లూదియ వినెను - విశ్వసించెను
తెరచెను తక్షణమే - తన హృదయమును
తెరువుము నీ హృదయద్వారమును
తట్టుచున్నాడు శ్రీ యేసుడు
|| నేడు ||
3)
పెంతెకోస్తనెడి దినమున - పేతురు దేవుని వాక్యములు పల్కెన్‌
పొడువబడిరి వాక్యముచే - ఇంచుమించు మూడువేలమంది
|| నేడు ||
4)
సువార్త ద్వారము మూయబడును - సోదరా (రీ) సమయము యిదియే నీకు
సమర్పించు నీ హృదయమును
సాక్షివై సాగిపో సదా ప్రభు కొరకు
|| నేడు ||
English   Needu Neevu Yesuni Maata
Chorus
Nedu Neevu Yesunimaata Vininacho
Nee Hrudayamunu Kathinaparachukonakumu
1)
Devuni Maatalu - Jeevapu Ootalu
Madhuramu - Mahaanandadaayakamu
Neetivantidi - Tenekanna Madhuram
Jeevitamunaku Velugaiyunnadi
|| Nedu ||
2)
Loodiya Vinenu - Visvasinchenu
Terachenu Takshaname - Tana Hrudayamunu
Teruvumu Nee Hrudayadvaaramunu
Tattuchunnaadu Sree Yesudu
|| Nedu ||
3)
Pentekostanedi Dinamuna - Peturu Devuni Vaakyamulu Palken
Poduvabadiri Vaakyamuche - Inchuminchu Mooduvelamandi
|| Nedu ||
4)
Suvaarta Dvaaramu Mooyabadunu - Sodaraa (Ree) Samayamu Yidiye Neeku
Samarpinchu Nee Hrudayamunu
Saakshivai Saagipo Sadaa Prabhu Koraku
|| Nedu ||
Present