తెలుగు నా పాపములన్ క్షమయించెన్
పల్లవినా పాపములను క్షమియించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్
ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్
1)మలిన వస్త్రములతో నేను - చెడిన హృదయముతో నేను
కలువరి సిలువను చేరన్
|| ప్రభు ||
2)మరణమునుండి నా ప్రాణమును - కన్నీటినుండి నా కన్నులను
తప్పించెను నా తండ్రి
|| ప్రభు ||
3)నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొఱపెట్టెదను
నా ప్రభు నా మొఱ వినును
|| ప్రభు ||
4)యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయముగల దేవుండు
సాధువులను గాపాడున్
|| ప్రభు ||
5)మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను
నా ప్రభునే స్తుతియింతున్
|| ప్రభు ||
6)యెహోవా తన స్వాస్థ్యముగా నన్ - బహుగా తన మహిమను
జూపించన్ - బహుప్రియమున నన్ బిలచెన్
|| ప్రభు ||
English Naa Paapamulan Kshamiyimchen
ChorusNaa Paapamulanu Kshamiyinchen - Prabhu Naa Netramulanu Veliginchen
Prabhu Yese Nannento Preminchen - Praanamunu Naa Korakosagen
1)Malina Vastramulato Nenu - Chedina Hrudayamuto Nenu
Kaluvari Siluvanu Cheran
|| Prabhu ||
2)Maranamunundi Naa Praanamunu - Kanneetinundi Naa Kannulanu
Tappinchenu Naa Tandri
|| Prabhu ||
3)Naa Jeevita Kaalamantayunu - Ne Naayanaku Morapettedanu
Naa Prabhu Naa Mora Vinunu
|| Prabhu ||
4)Yehovaa Bahudayaalundu - Neeti Nyaayamugala Devundu
Saadhuvulanu Gaapaadun
|| Prabhu ||
5)Mandira Aavaranamulo Nenu - Yerooshalemaa Nee Madhyanu
Naa Prabhune Sthuthiyintun
|| Prabhu ||
6)Yehovaa Tana Svaasthyamugaa Nan - Bahugaa Tana Mahimanu
Joopinchan - Bahupriyamuna Nan Bilachen
|| Prabhu ||