తెలుగు ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పల్లవిప్రభువా నీ పరిపూర్ణత నుండి - పొందితిమి కృపవెంబడి కృపను
1)ప్రభువైన యేసుక్రీస్తు - పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు
|| ప్రభు ||
2)జనకా నీ వెన్నుకొనిన - జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము
|| ప్రభు ||
3)నీదు స్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము
|| ప్రభు ||
4)దేవా నీ ప్రజల యెడల - దినదినము నీకున్న
ఘనుడా నీదు దయతో - నను జ్ఞాపకముంచుకొనుము
|| ప్రభు ||
5)దేవా నీదు స్వరూప - దివ్యదర్శనమును
దినదినము నాకొసగి - నను జ్ఞాపకముంచుకొనుము
|| ప్రభు ||
6)మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకుడనిన
మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము
|| ప్రభు ||
7)ముదమార నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము
|| ప్రభు ||
8)కృపా సత్య సమ్మిళిత - సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో - ఎల్లప్పుడు కలుగుగాక
|| ప్రభు ||
English Prabhuvaa Nee Paripoorantha Nundi
ChorusPrabhuvaa Nee Paripoornata Nundi - Ponditimi Krupavenbadi Krupanu
1)Prabhuvaina Yesukreestu - Paraloka Vishayamulo
Prati Aaseervaadamunu - Prasaadinchitivi Maaku
|| Prabhu ||
2)Janakaa Nee Vennukonina - Janula Kshemamu Joochi
Santoshinchunatlu - Nanu Gnaapakamunchukonumu
|| Prabhu ||
3)Needu Svaasthyamainatti - Nee Prajalato Kalisi
Koniyaadunatlugaa - Nanu Gnaapakamunchukonumu
|| Prabhu ||
4)Devaa Nee Prajala Yedala - Dinadinamu Neekunna
Ghanudaa Needu Dayato - Nanu Gnaapakamunchukonumu
|| Prabhu ||
5)Devaa Needu Svaroopa - Divyadarsanamunu
Dinadinamu Naakosagi - Nanu Gnaapakamunchukonumu
|| Prabhu ||
6)Mee Madhyana Naa Aatma - Unnadi Bhayapadakudanina
Mahonnatudaa - Nanu Gnaapakamunchukonumu
|| Prabhu ||
7)Mudamaara Nannennukoni - Mudra Yungaramuganu
Chetunanina Prabhuvaa - Nanu Gnaapakamunchukonumu
|| Prabhu ||
8)Krupaa Satya Sammilita - Sanpoorna Svaroopa
Hallelooyaa Neeke Prabho - Ellappudu Kalugugaaka
|| Prabhu ||