Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 921

యేసు ప్రభుని సేవ

Yesu Prabhuni Seva

Open in Word & Worship App
తెలుగు   యేసు ప్రభుని సేవ
పల్లవి
యేసు ప్రభుని సేవ - ఘనమైన ప్రభుని సేవ
మాకిల దొరికిన - మహాదైశ్వర్యము - మాకిల దొరికిన మహాదైశ్వర్యము
మా స్తుతులను గొనుమా - మా దేవా వందనమిదె గొనుమా
1)
హీనులమైన మానవాళికి - ఈవిగ దొరికిన మా ప్రభు సేవ
దీనుని బ్రోచి పాపిని కాచి - దైవసుతులుగ చేసిన ప్రభువా
|| యేసు ||
2)
జగతికి పునాది వేయకముందే - ఏర్పరచితివి యేసుక్రీస్తులో
నీ గుణాతిశయముల ప్రకటించను - నీ రుధిరముతో కడిగిన దేవా
|| యేసు ||
3)
వధింపబడితివి కలువరియందు - లోకపాపమును మోసెడి గొఱ్ఱెగ
చేసితివి మము యాజకులనుగా - తీర్చితివి మా పాప ఋణమున
|| యేసు ||
4)
ఉత్తమము అనుకూలమైనది - ప్రభు చిత్తమును ఎరిగిన సేవ
పాపికి రక్షణ ప్రకటించుటయే - పానార్పణమగు యేసుని సేవ
|| యేసు ||
English   Yesu Prabhuni Seva
Chorus
Yesu Prabhuni Seva - Ghanamaina Prabhuni Seva
Maakila Dorikina - Mahaadaisvaryamu - Maakila Dorikina Mahaadaisvaryamu
Maa Stutulanu Gonumaa - Maa Devaa Vandanamide Gonumaa
1)
Heenulamaina Maanavaaliki - Eeviga Dorikina Maa Prabhu Seva
Deenuni Brochi Paapini Kaachi - Daivasutuluga Chesina Prabhuvaa
|| Yesu ||
2)
Jagatiki Punaadi Veyakamunde - erparachitivi Yesukreestulo
Nee Gunaatisayamula Prakatinchanu - Nee Rudhiramuto Kadigina Devaa
|| Yesu ||
3)
Vadhinpabaditivi Kaluvariyandu - Lokapaapamunu Mosedi Gorrega
Chesitivi Mamu Yaajakulanugaa - Teerchitivi Maa Paapa Runamuna
|| Yesu ||
4)
Uttamamu Anukoolamainadi - Prabhu Chittamunu Erigina Seva
Paapiki Rakshana Prakatinchutaye - Paanaarpanamagu Yesuni Seva
|| Yesu ||
Present