తెలుగు పరిశుద్దుడవు పరిశుద్దుడవు
పల్లవిపరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు యేసయ్యా
వందన ఘనత స్తోత్రము నొందగ నీవే యోగ్యుడవు
ఏక భావముతో - లోకనాథా ఆరాధింతుము ప్రసిద్ధిజేయుచు
విశుద్ధ మనముతో - ఆరాధింతుము - కీర్తింతుము
1)విరాజిల్లు నీ శిరోజాలతో - అగ్ని జ్వలమౌ నేత్రాలతో
రంజిలు అపరంజిని బోలిన - నీ పాద యుగళిని మోదమొందగ
|| ఏక ||
2)విస్తార జలముల వెల్లువ ధ్వనులై - నీ కంఠస్వరము నినదించెనే
సప్త జ్యోతులను చేపట్టిన నీ - హస్తాల క్రిందను ఆశ్రయ మొందుచు
|| ఏక ||
3)జీవులు పెద్దలు సృష్టి దూతలు - జీవించు నిన్నే స్తోత్రించుచుండగ
క్రీస్తు యేసులో స్వాస్థ్యముగా -కీర్తించెదము నిరంతరము
|| ఏక ||
4)ప్రాణాత్మ కీళ్ళను పరిశీలించే - నీ నోటిమాటల నిచ్ఛయించుచు
విరిగి నలిగిన మా హృదయాలతో - విరివిగ స్తుతులను అర్పించెదము
|| ఏక ||
English Parishuddudavu Parishuddudavu
ChorusParisuddhudavu Parisuddhudavu Parisuddhudavu Yesayyaa
Vandana Ghanata Stotramu Nondaga Neeve Yogyudavu
eka Bhaavamuto - Lokanaathaa Aaraadhintumu Prasiddhijeyuchu
Visudha Manamuto - Aaraadhintumu - Keertintumu
1)Viraajillu Nee Sirojaalato - Agni Jvalamau Netraalato
Ranjilu Aparanjini Bolina - Nee Paada Yugalini Modamondaga
|| eka ||
2)Vistaara Jalamula Velluva Dhvanulai - Nee Kanthasvaramu Ninadinchene
Sapta Jyotulanu Chepattina Nee - Hastaala Krindanu Aasraya Monduchu
|| eka ||
3)Jeevulu Peddalu Srushti Dootalu - Jeevinchu Ninne Stotrinchuchundaga
Kreestu Yesulo Svaasthyamugaa -Keertinchedamu Nirantaramu
|| eka ||
4)Praanaatma Keellanu Pariseelinche - Nee Notimaatala Nichchayinchuchu
Virigi Naligina Maa Hrudayaalato - Viriviga Stutulanu Arpinchedamu
|| eka ||