తెలుగు నా బలమా నా శైలమా
పల్లవినా బలమా నా శైలమా - అక్షయ రక్షణ శృంగమా
ప్రతి విషయములో కృతజ్ఞతా - స్తుతి చెల్లింతును కీర్తింతును
1)జలాంధకారమునైనా - వనాంధకారమునైనా
సైన్యములకు అధిపతివై - ఇశ్రాయేలును నడిపితివే
నను మేపిన ఓ కాపరీ - నన్ను మలచిన ఓ కుమ్మరీ
నేను నిన్ను స్తోత్రించుటకు - నీవే కారణభూతుడవు
|| నా ||
2)పర్వత ప్రాంతమునైనా - వాగుల మైదానమైనా
మచ్చిక జేసి పచ్చిక మేపి - వెచ్చగ ఆదరించితివే
జీవింపజేసే నా ఊపిరి - జీవము నిచ్చిన నా కాపరీ
|| నా ||
3)ఏ కాలమునందైనా - ఏలాంటి స్థితిలోనైనా
నన్ను వీడక ఎడబాయక - చెన్నుగ ఆదుకొంటివే
తేనియ పలుకులు ఓ తొలకరీ - దైవ తేజమా ఓ నా సిరి
|| నా ||
English Naa Balamaa Naa Shailamaa
ChorusNaa Balamaa Naa Sailamaa - Akshaya Rakshana Srngamaa
Prati Vishayamulo Krutagnaataa - Sthuthi Chellintunu Keertintunu
1)Jalaandhakaaramunainaa - Vanaandhakaaramunainaa
Sainyamulaku Adhipativai - Israayelunu Nadipitive
Nanu Mepina O Kaaparee - Nannu Malachina O Kummaree
Nenu Ninnu Stotrinchutaku - Neeve Kaaranabhootudavu
|| Naa ||
2)Parvata Praantamunainaa - Vaagula Maidaanamainaa
Machchika Jesi Pachchika Mepi - Vechchaga Aadarinchitive
Jeevinpajese Naa Oopiri - Jeevamu Nichchina Naa Kaaparee
|| Naa ||
3)e Kaalamunandainaa - elaanti Sthitilonainaa
Nannu Veedaka Edabaayaka - Chennuga Aadukontive
Teniya Palukulu O Tolakaree - Daiva Tejamaa O Naa Siri
|| Naa ||