తెలుగు దేవాది దేవా ప్రభువుల
పల్లవిదేవాది దేవా - ప్రభువుల ప్రభూ - రాజుల రాజా - హల్లెలూయా
1)నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించి
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి - పరలోక పాటన్ నా కొసగితివి
|| దేవాది ||
2)జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయము నిచ్చి
జయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న
|| దేవాది ||
3)పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
అరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి
|| దేవాది ||
4)మరణ పాత్రులం యిద్ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి
|| దేవాది ||
5)శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండా
నీ దయ నాపై నిండారనింపి - ఓదార్చి నన్ను నీ దారినడుపు
|| దేవాది ||
6)ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభుని జాడలు సారముఁజల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్
|| దేవాది ||
7)పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తి గల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతము పాడ - జేర్చితివి నన్ నీ జనమునందు
|| దేవాది ||
English Devaadi Devaa Prabhuvula
ChorusDevaadi Devaa - Prabhuvula Prabhoo - Raajula Raajaa - Hallelooyaa
1)Nee Raktamuto Vimochinchi - Nee Raktamuto Sanpaadinchi
Paraloka Raajya Prajalato Jerchi - Paraloka Paatan Naa Kosagitivi
|| Devaadi ||
2)Jeevita Naavalo Tuphaanu Rega - Bhayapadakudani Abhayamu Nichchi
Jayapradamugaa Nannu Nadipinchi - Jayajeevitamu Naa Kosaguchunna
|| Devaadi ||
3)Peru Petti Nan Premato Pilachi - Karunato Nee Sottugaa Nannu Jesi
Aramara Leka Nannaadarinchi - Paraloka Darsananbichchitivi
|| Devaadi ||
4)Marana Paatrulan Yidharanilona - Durita Runamula Smarananu Maanpi
erparachukontivi Nerputo Mammu - Nee Raajyamandu Raajulan Jesi
|| Devaadi ||
5)Sodhanagaadhala Kashtamulalo - Naa DuHkhamulalo Ne Nedvakundaa
Nee Daya Naapai Nindaaraninpi - Odaarchi Nannu Nee Daarinadupu
|| Devaadi ||
6)Prati Vatsaramu Dayatoda Ninpun - Prabhuni Jaadalu Saaramunjallun
Prati Beedunoo Saaramu Chilakan - Prati Parvatamu Aanandinchun
|| Devaadi ||
7)Paraloka Parisudha Sanghanbu Yeduta - Sarvasakti Gala Kreestuni Yeduta
Paraloka Nootana Geetamu Paada - Jerchitivi Nan Nee Janamunandu
|| Devaadi ||