తెలుగు ఆశ్చర్యకరుడా! మా
పల్లవిఆశ్చర్యకరుడా! మా ఆనందగానమా!
ఆశ్చర్యకరుడా! మా ఆశ్రమ దుర్గమా !
1)మన్నును మిన్నును జేసిన దేవా - కన్నియ మేరి కనిన తనయుడా
కలువరి గిరిపై కెక్కిన వాడా - కరుణను పాపుల బ్రోచెడు దేవా
|| ఆ ||
2)నిన్న నేడు నీ ఒకటే రీతిగ - నున్న వాడవు ఉందువు నిరతం
నిన్ను నమ్మిన భక్తులనెల్ల యెన్నడు విడువక బ్రోచెడు దేవా
|| ఆ ||
3)పెంట పోగుపై పారవేసిన - మంటి పురుగునై పైకెత్తితివే
ఒంటరి వానిని వందలు వేలుగ - ఫలియించుట నీ భాగ్యమేకదా
|| ఆ ||
4)నీవుండగ నాకేమియు కొదువ - లేదని చాటెద నెల్లవేళలన్
ఓపజాలని ఆపదలెన్నో - బాపెడు నీ కృప నేనెరుగుదును
|| ఆ ||
5)యెర్రసముద్రము పాయలు జేసి - ఇశ్రాయేలును నడిపించితివే
గాలి తుఫానును గద్ధించగనే - గడగడలాడుచు ఆగిపోయెనే
|| ఆ ||
6)సింహపు నోళ్ళను మూసిన దేవా - అగ్నిబలము చల్లార్చిన దేవా
ధరణిలో మరణపు విజేతవు నీవే - కరుణను మాకాశ్రయుడవు నీవే
|| ఆ ||
English Aashcharyakarudaa! Maa
ChorusAascharyakarudaa! Maa Aanandagaanamaa!
Aascharyakarudaa! Maa Aasrama Durgamaa !
1)Mannunu Minnunu Jesina Devaa - Kanniya Meri Kanina Tanayudaa
Kaluvari Giripai Kekkina Vaadaa - Karunanu Paapula Brochedu Devaa
|| Aa ||
2)Ninna Nedu Nee Okate Reetiga - Nunna Vaadavu Unduvu Niratam
Ninnu Nammina Bhaktulanella Yennadu Viduvaka Brochedu Devaa
|| Aa ||
3)Penta Pogupai Paaravesina - Manti Purugunai Paikettitive
Ontari Vaanini Vandalu Veluga - Phaliyinchuta Nee Bhaagyamekadaa
|| Aa ||
4)Neevundaga Naakemiyu Koduva - Ledani Chaateda Nellavelalan
Opajaalani Aapadalenno - Baapedu Nee Krupa Nenerugudunu
|| Aa ||
5)Yerrasamudramu Paayalu Jesi - Israayelunu Nadipinchitive
Gaali Tuphaanunu Gaddhinchagane - Gadagadalaaduchu Aagipoyene
|| Aa ||
6)Sinhapu Nollanu Moosina Devaa - Agnibalamu Challaarchina Devaa
Dharanilo Maranapu Vijetavu Neeve - Karunanu Maakaasrayudavu Neeve
|| Aa ||