Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 901 Old No: 744

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

Stuthipaatrudaa Stothraarhudaa

Open in Word & Worship App
తెలుగు   స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
పల్లవి
స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా
స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా (2)
1)
దివి నుండి దిగి వచ్చిన దేవాది దేవుడు
భువిలోన పాపుల రక్షణ కొరకై (2)
దివ్యరుధిరంబు చిందించెను
విశ్వసించగ నాకు విడుదల నిచ్చెన్‌ (2)
పరలోకము నందు కూర్చుండ బెట్టెను (2)
|| స్తు ||
2)
నీ ఉపకారములు లెక్కింప తరమా
నీ మేలులన్నీ వర్ణింప తరమా (2)
నా హృది గదిలోన నివసింపగోరినా
నజరేయుడా నిను హెచ్చింతునయ్యా (2)
నా స్నేహితుడా, నిను ఘనపరతునయ్యా (2)
|| స్తు ||
3)
నా పాప భారం నీవు మోసినావు
నా శాప మంతటిని భరియించినావు (2)
వధకు తేబడు గొర్రెపిల్ల వోలే
మౌనముగా వున్నావు దేవా (2)
నాకు రక్షణను ఒసగితివి ప్రభువా (2)
|| స్తు ||
English   Stuthipaatrudaa Stothraarhudaa
Chorus
Sthuthi Paatrudaa, Stotraarhudaa
Stutulanduko Naa Priya Snehitudaa (2)
1)
Divi Nundi Digi Vachchina Devaadi Devudu
Bhuvilona Paapula Rakshana Korakai (2)
Divyarudhiranbu Chindinchenu
Visvasinchaga Naaku Vidudala Nichchen (2)
Paralokamu Nandu Koorchunda Bettenu (2)
|| Stu ||
2)
Nee Upakaaramulu Lekkinpa Taramaa
Nee Melulannee Varninpa Taramaa (2)
Naa Hrudi Gadilona Nivasinpagorinaa
Najareyudaa Ninu Hechchintunayyaa (2)
Naa Snehitudaa, Ninu Ghanaparatunayyaa (2)
|| Stu ||
3)
Naa Paapa Bhaaran Neevu Mosinaavu
Naa Saapa Mantatini Bhariyinchinaavu (2)
Vadhaku Tebadu Gorrepilla Vole
Maunamugaa Vunnaavu Devaa (2)
Naaku Rakshananu Osagitivi Prabhuvaa (2)
|| Stu ||
Present