తెలుగు విమల చరితుడా
పల్లవివిమల చరితుడా - దైవ కొమరుడ క్రీస్తు నాథుడ - నిన్నే కొలిచెద
నీదు నామము - యెంతో మధురము
1)యేసు నామము-పావన నామము పాపికాశ్రయం-పాపవిమోచనం
దైవనామము-నరావతారము ఏకనామము-యెహోవానామము
|| విమల ||
2)ప్రేమమయుడ-దైవసముడ జ్యోతిర్మయుడ-నీతిమంతుడ
రిక్తుడైతివి-రక్షణార్ధమై మరణమైతివి-మనుజకొమరుడ
|| విమల ||
3)దైవమహిమ-తేజరూపుడ దైవతత్వపు - మూర్తిమంతుడ
మహిమగల-నీమాట చేతనే నిర్వహించితి-నిఖిల జగముల
|| విమల ||
4)సర్వ సృష్టికి - ఆదిసంభవ అదృశ్యదేవుని - రూపమీవెగ
ఆదివాక్యమా - అల్ఫ ఓమెగ వారసుండవె - వందనంబిదె
|| విమల ||
5)పాపభారము - మోసినాడవె మోపురీతిగ-నీవీపు పైన
కరుణిజూపిన-కన్యతనయుడ ముక్తి నొసగిన-మృత్యుంజయుడవె
|| విమల ||
6)యూద గోత్రపు-కొదమసింగమా రానైయుంటి వి-రాజులరాజుగ
వేచియుంటి మి-నీదురాకకై వేగరమ్మయా-దూతగణముతో
|| విమల ||
English Vimala Charitudaa
ChorusVimala Charitudaa - Daiva Komaruda Kreestu Naathuda - Ninne Kolicheda
Needu Naamamu - Yento Madhuramu
1)Yesu Naamamu-Paavana Naamamu Paapikaasrayan-Paapavimochanam
Daivanaamamu-Naraavataaramu ekanaamamu-Yehovaanaamamu
|| Vimala ||
2)Premamayuda-Daivasamuda Jyotirmayuda-Neetimantuda
Riktudaitivi-Rakshanaardhamai Maranamaitivi-Manujakomaruda
|| Vimala ||
3)Daivamahima-Tejaroopuda Daivatatvapu - Moortimantuda
Mahimagala-Neemaata Chetane Nirvahinchiti-Nikhila Jagamula
|| Vimala ||
4)Sarva Srushtiki - Aadisanbhava Adrusyadevuni - Roopameevega
Aadivaakyamaa - Alpha Omega Vaarasundave - Vandanambide
|| Vimala ||
5)Paapabhaaramu - Mosinaadave Mopureetiga-Neeveepu Paina
Karunijoopina-Kanyatanayuda Mukti Nosagina-Mrtyunjayudave
|| Vimala ||
6)Yooda Gotrapu-Kodamasingamaa Raanaiyunti Vi-Raajularaajuga
Vechiyunti Mi-Needuraakakai Vegarammayaa-Dootaganamuto
|| Vimala ||