Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 9 Old No: 12

నా ప్రాణమా యేసుప్రభుని

Naa Praanamaa Yesuprabhuni

♪ P.Bikshaalu
Open in Word & Worship App
తెలుగు   నా ప్రాణమా యేసుప్రభుని
పల్లవి
నా ప్రాణమా యేసుప్రభుని - సన్నుతించుమా
ఆయన చేసిన ఉపకారములలో - దేనిని మరువకుమా
1)
దోషములన్ని క్షమియించినాడు - పాపములన్ని భరియించినాడు
కోపము జూపక - శాపము బాపెను
కాపరియై మనల గాచెను గాదా
|| నా ||
2)
సంకటములన్ని - టిని సవరించి సమాధినుండి విమోచించి
చల్లని దయ మన - కిరీటముగా నుంచి
సతతము మనలను గాచెను ప్రభువు
|| నా ||
3)
నిత్యము తానే ప్రేమించువాడు - సత్యము జీవము మార్గము
యేసే - అత్యధికంబౌ మన దోషములకు
ఆ సిలువపైని అసువులర్పించెను
|| నా ||
4)
మరణము గెల్చి ఆరోహణమై - పరమున మనకు నివాస
మేర్చరచెన్‌ - తిరగి వచ్చి తనతో గొనిపోవును
తరతరములుగా తనతోడనుంచును
|| నా ||
English   Naa Praanamaa Yesuprabhuni
Chorus
Naa Praanamaa Yesuprabhuni - Sannutinchumaa
Aayana Chesina Upakaaramulalo - Denini Maruvakumaa
1)
Doshamulanni Kshamiyinchinaadu - Paapamulanni Bhariyinchinaadu
Kopamu Joopaka - Saapamu Baapenu
Kaapariyai Manala Gaachenu Gaadaa
|| Naa ||
2)
Sankatamulanni - Tini Savarinchi Samaadhinundi Vimochinchi
Challani Daya Mana - Kireetamugaa Nunchi
Satatamu Manalanu Gaachenu Prabhuvu
|| Naa ||
3)
Nityamu Taane Preminchuvaadu - Satyamu Jeevamu Maargamu
Yese - Atyadhikanbau Mana Doshamulaku
Aa Siluvapaini Asuvularpinchenu
|| Naa ||
4)
Maranamu Gelchi Aarohanamai - Paramuna Manaku Nivaasa
Mercharachen - Tiragi Vachchi Tanato Gonipovunu
Tarataramulugaa Tanatodanunchunu
|| Naa ||
Present