తెలుగు దేవా నీ తలంపులు
పల్లవిదేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ రక్షణ సర్వ సదా నిలుచుచున్నది
1)స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే - స్తుతి పాడెద హృదయముతో
స్తుతించి వర్ణించి ఘనపరతున్ - నీవే నా రక్షకుడవని
|| దేవా ||
2)మొదట నిన్ను యెరుగనైతిని - మొదటే నన్ను యెరిగితివి
వెదుక లేదు ప్రభువా నేను - వెదకితివి యీ పాపిని
|| దేవా ||
3)మరణమగు ఊబిలో నుంటిని - కరుణ పిలచె నన్ను రక్షింప
మరణము నుండి రక్షింపన్ - నా ప్రభు బలియాయెను
|| దేవా ||
4)పాపలోకములో మునిగియుంటిని - పాపశిక్షకు పాత్రుడను
యేసు ప్రభు సిలువ సహించెను - నాకు నూతన జీవమొసగ
|| దేవా ||
5)అద్భుతమైనది సిలువ దృశ్యం - ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
ప్రభువును వర్ణింప నశక్యము - ప్రభువే సహించె దుఃఖము
|| దేవా ||
6)ఎట్లు మౌనముగా నుందు ప్రభూ - చెల్లింపక స్తోత్ర గీతము
కాలమంతా పాడుచుండెద - నీ ప్రేమ అపారమైనది
|| దేవా ||
English Devaa Nee Talampulu
ChorusDevaa Nee Talanpulu Amoolyamainavi Naa Yeda
Naa Yedala Nee Rakshana Sarva Sadaa Niluchuchunnadi
1)Stutularpintu Prabhu Neeku Nede - Sthuthi Paadeda Hrudayamuto
Sthuthinchi Varninchi Ghanaparatun - Neeve Naa Rakshakudavani
|| Devaa ||
2)Modata Ninnu Yeruganaitini - Modate Nannu Yerigitivi
Veduka Ledu Prabhuvaa Nenu - Vedakitivi Yee Paapini
|| Devaa ||
3)Maranamagu Oobilo Nuntini - Karuna Pilache Nannu Rakshinpa
Maranamu Nundi Rakshinpan - Naa Prabhu Baliyaayenu
|| Devaa ||
4)Paapalokamulo Munigiyuntini - Paapasikshaku Paatrudanu
Yesu Prabhu Siluva Sahinchenu - Naaku Nootana Jeevamosaga
|| Devaa ||
5)Adbhutamainadi Siluva Drusyan - Prabhuvunu Kotti Ummivesiri
Prabhuvunu Varninpa Nasakyamu - Prabhuve Sahinche DuHkhamu
|| Devaa ||
6)Etlu Maunamugaa Nundu Prabhoo - Chellinpaka Stotra Geetamu
Kaalamantaa Paaduchundeda - Nee Prema Apaaramainadi
|| Devaa ||