తెలుగు ప్రభువా నీ గొప్పతనము
పల్లవిప్రభువా నీ గొప్పతనము - స్తుతికి యోగ్యము
అవశ్యకమైనది - వర్ణించలేమిల
1)సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో ఉత్తమము
మానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తము
నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించలేమిల
|| ప్రభువా ||
2)నీ రూపమున నరుని సృజించి అధికారము నిచ్చితివి
క్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివి
నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల
|| ప్రభువా ||
3)సృష్టిని చేసిన శక్తికంటె పాపికి రక్షణ గొప్పది
నీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావు
నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల
|| ప్రభువా ||
4)నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించు చున్నావు
అందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివి
నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల
|| ప్రభువా ||
5)అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివి
రాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివి
నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల
|| ప్రభువా ||
6)ఉల్లాసముతో సృష్టిమైమరచే - అద్భుత కార్యములను చూచి
సంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరి
నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల
|| ప్రభువా ||
English Prabhuvaa Nee Goppatanamu
ChorusPrabhuvaa Nee Goppatanamu - Sthuthiki Yogyamu
Avasyakamainadi - Varninchalemila
1)Srushti Goppadi Adbhutamegaa - Sankalpamento Uttamamu
Maanavajaati Korakai Prabhoo - Siddaparache Samastamu
Needu Panulu Nee Saamarthyamu Varninchalemila
|| Prabhuvaa ||
2)Nee Roopamuna Naruni Srujinchi Adhikaaramu Nichchitivi
Kreestunandu Nirdoshinigaa - Niluvabetta Goritivi
Needu Daya Nee Manchitanamu Varninchalemila
|| Prabhuvaa ||
3)Srushtini Chesina Saktikante Paapiki Rakshana Goppadi
Nee Yodda Nunna Sarvamichchi - Viluvagu Mutyamu Konnaavu
Nee Aisvaryamu Nee Mahimanu Varninchalemila
|| Prabhuvaa ||
4)Neeku Maanavudamoolyamu - Neevu Preminchu Chunnaavu
Anduke Nee Praanamarpinchi - Raktamu Kaarchi Rakshinchitivi
Nee Adbhuta Prema Nee Krupa Varninchalemila
|| Prabhuvaa ||
5)Adbhutamaina Nootana Srushti - Maanavuniki Nichchitivi
Raajulanuga Yaajakuluga Vaarasuluganu Chesitivi
Nee Raajyamu Nee Prabhaavamu Varninchalemila
|| Prabhuvaa ||
6)Ullaasamuto Srushtimaimarache - Adbhuta Kaaryamulanu Choochi
Santoshinchi Aaraadhinchiri - Neeve Sarvamani Cheppiri
Nee Prabhutvamu Needu Satyamu Varninchalemila
|| Prabhuvaa ||