Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 89

దేవునికే స్తోత్రము గానము

Devunike Stotramu Gaanamu

♪ Repuri Elisha
Open in Word & Worship App
తెలుగు   దేవునికే స్తోత్రము గానము
పల్లవి
దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
1)
యెరుషలేము నెహూవాయే - కట్టుచున్నవాడని
ఇశ్రాయేలీయులను - పోగు చేయువాడని
|| దేవు ||
2)
గుండె చెదిరినవారిని - బాగుచేయువాడని
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని
|| దేవు ||
3)
నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు - పెట్టుచున్నవాడని
|| దేవు ||
4)
ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియులేని వాడని
|| దేవు ||
5)
దీనులకు అండాయనే - భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
|| దేవు ||
6)
ఆయన ఆకాశమున్‌ - మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము - సిద్ధపర్చువాడని
|| దేవు ||
7)
పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపించును
అరచు పిల్ల కాకులకు - ఆహారము తానీయును
|| దేవు ||
8)
గుఱ్ఱముల నరులందలి - బలము నానందించడు
కృపకు వేడువారిలో - సంతసించువాడని
|| దేవు ||
9)
యెరుషలేము యెహోవాను - సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము - ఆనందించువాడని
|| దేవు ||
10)
పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్‌
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును
|| దేవు ||
11)
భూమికి తన యాజ్ఞను - ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును
|| దేవు ||
12)
వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడని
ఏ జనము కీలాగున - చేసియుండలేదని
|| దేవు ||
English   Devunike Stotramu Gaanamu
Chorus
Devunike Stotramu Gaanamu Cheyutaye Manchidi
Manamandaramu Sthuthi Gaanamu Cheyutaye Manchidi
1)
Yerushalemu Nehoovaaye - Kattuchunnavaadani
Israayeleeyulanu - Pogu Cheyuvaadani
|| Devu ||
2)
Gunde Chedirinavaarini - Baagucheyuvaadani
Vaari Gaayamulanniyu - Kattuchunnavaadani
|| Devu ||
3)
Nakshatramula Sankhyanu - Aayane Niyaminchenu
Vaatikanniyu Perulu - Pettuchunnavaadani
|| Devu ||
4)
Prabhuvu Goppavaadunu - Adhika Sakti Sanpannudu
Gnaanamunaku Aayane - Mitiyuleni Vaadani
|| Devu ||
5)
Deenulaku Andaayane - Bhaktiheenula Koolchunu
Sitaaraato Devuni - Stutulato Keertinchudi
|| Devu ||
6)
Aayana Aakaasamun - Meghamulato Kappunu
Bhoomi Koraku Varshamu - Sidhaparchuvaadani
|| Devu ||
7)
Parvatamulalo Gaddini - Pasuvulaku Molipinchunu
Arachu Pilla Kaakulaku - Aahaaramu Taaneeyunu
|| Devu ||
8)
Gurramula Narulandali - Balamu Naanandinchadu
Krupaku Veduvaarilo - Santasinchuvaadani
|| Devu ||
9)
Yerushalemu Yehovaanu - Seeyonu Nee Devuni
Keertinchumu Koniyaadumu - Aanandinchuvaadani
|| Devu ||
10)
Pillala Naaseervadinchiyu - Balaparache Nee Gummamul
Manchi Godhuma Pantato - Ninnu Truptiga Nunchunu
|| Devu ||
11)
Bhoomiki Tana Yaagnaanu - Ichchuvaadu Aayane
Vegamuganu Devuni - Vaakyamu Parugettunu
|| Devu ||
12)
Vaakyamunu Yaakobuku - Teliyajesina Vaadani
e Janamu Keelaaguna - Chesiyundaledani
|| Devu ||
Present