Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 883 Old No: 601

శోభిత వస్త్రధారి

Shobhita Vastraadhaari

Open in Word & Worship App
తెలుగు   శోభిత వస్త్రధారి
పల్లవి
శోభిత వస్త్రధారి - సంక్షోభిత సిల్వధారి
సహస్ర నామధారి - సకల దోష పరిహారి
హల్లెలూయ యేసయ్య - హల్లెలూయ మెస్సీయ
హల్లెలూయ స్తుతి స్తోత్రము
1)
జగతికి ప్రగతిని గూర్చి - పగతుల సుతులుగ మార్చి
స్వర్గ భాగ్యము నిచ్చి - అగ్రజులుగా చేసితివి
|| హల్లె ||
2)
నిత్యమైన కృపతో - నిత్యజీవము నొసగి
నిత్యమగు నిబంధనతో - నీతిమత్వము నొసగితివి
|| హల్లె ||
3)
భరింపలేని శ్రమలు - భీకరముగ పైబడగా
భారముతో ప్రార్థింప - కోరిన రేవుకు చేర్చితివి
|| హల్లె ||
4)
ఇహలోక భోగము కోరక - ఇహలోక మాలిన్యమంటక
ఇహమున అహమును వీడి - సహనముతో నడువ నేర్పు
|| హల్లె ||
English   Shobhita Vastraadhaari
Chorus
Sobhita Vastradhaari - Sankshobhita Silvadhaari
Sahasra Naamadhaari - Sakala Dosha Parihaari
Hallelooya Yesayya - Hallelooya Messeeya
Hallelooya Sthuthi Stotramu
1)
Jagatiki Pragatini Goorchi - Pagatula Sutuluga Maarchi
Svarga Bhaagyamu Nichchi - Agrajulugaa Chesitivi
|| Halle ||
2)
Nityamaina Krupato - Nityajeevamu Nosagi
Nityamagu Nibandhanato - Neetimatvamu Nosagitivi
|| Halle ||
3)
Bharinpaleni Sramalu - Bheekaramuga Paibadagaa
Bhaaramuto Praarthinpa - Korina Revuku Cherchitivi
|| Halle ||
4)
Ihaloka Bhogamu Koraka - Ihaloka Maalinyamantaka
Ihamuna Ahamunu Veedi - Sahanamuto Naduva Nerpu
|| Halle ||
Present