తెలుగు నా ప్రియుడు అతిసుందరుడు
పల్లవినా ప్రియుడు అతి సుందరుడు - పదివేలమందిలో అతి శ్రేష్ఠుడు
1)అతని శిరస్సు అపరంజి వంటిది - అయినను తనదు శిరమును వంచి
నాతలను పైకెత్తియున్నాడు - ఆరాధ్యదైవము ఆ యేసు ప్రభువే
|| నా ||
2)అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పములు - అతని కరములు
రత్న భూషితములు - అయినను తనదు కరములు చాచి - నా
కరముల పాపం - పరిహరించాడు
|| నా ||
3)అతని కాళ్ళు మేలిమి స్తంభాలు - అతని వైఖరి లెబానోను
తుల్యము - అయినను తన కాళ్ళు నాకై అర్పించి
నాకాళ్ళపాపమును కడిగివేశాడు
|| నా ||
4)అతని నోరు అతి మధురంబు - అతడే నాకు అతి కాంక్షనీయుడు
ఇతడే హితుడు నా ప్రాణ స్నేహితుడు - ముక్తినొసంగి తన
శక్తినిచ్చాడు
|| నా ||
English Naa Priyudu Athisundarudu
ChorusNaa Priyudu Ati Sundarudu - Padivelamandilo Ati Sreshthudu
1)Atani Sirassu Aparanji Vantidi - Ayinanu Tanadu Siramunu Vanchi
Naatalanu Paikettiyunnaadu - Aaraadhyadaivamu Aa Yesu Prabhuve
|| Naa ||
2)Atani Chekkillu Parimala Pushpamulu - Atani Karamulu
Ratna Bhooshitamulu - Ayinanu Tanadu Karamulu Chaachi - Naa
Karamula Paapan - Pariharinchaadu
|| Naa ||
3)Atani Kaallu Melimi Stanbhaalu - Atani Vaikhari Lebaanonu
Tulyamu - Ayinanu Tana Kaallu Naakai Arpinchi
Naakaallapaapamunu Kadigivesaadu
|| Naa ||
4)Atani Noru Ati Madhuranbu - Atade Naaku Ati Kaankshaneeyudu
Itade Hitudu Naa Praana Snehitudu - Muktinosangi Tana
Saktinichchaadu
|| Naa ||