తెలుగు ప్రభువా! దేవా! నను
పల్లవిప్రభువా! దేవా ! నను రక్షించియు
నను కరుణించియు నీవానిగా నను చేసితివి
1)శాశ్వత ప్రేమతో ప్రేమించితివి - విడువక నా ఎడ కృప చూపితివి
తంబూర సితార నాదంబులతో - చక్కగ నిను స్తుతించెదను
|| ప్రభువా ||
2)దుఃఖము నాలో తీసివేసితివి - శాశ్వత సంతోషము దయచేసితివి
నీవు మేపెడి గొర్రెగ నుందును - నిరతము నిను స్తుతియించెదను
|| ప్రభువా ||
3)నడిపించితివి ప్రేమ మీరగ - నిండుగ జీవ జలములు త్రావగ
నీవే నాకు నిత్య రక్షణ - నీ యందే నా నిరీక్షణ
|| ప్రభువా ||
4)సంతసముతో నిను గానము చేసెద - సంఘముతోనే కలిసి యుండెదన్
ప్రార్థించెదను ఆత్మల కొరకై - ప్రకటించెదను నీ వాక్యమును
|| ప్రభువా ||
5)కన్యకలు, యౌవనులు, వృద్ధులు - నాట్యమాడుచు ఆనందింపగ
నేను కూడను వారితో నుందును - నిత్యము నిను స్తుతియించెదను
|| ప్రభువా ||
English Prabhuvaa! Devaa! Nanu
ChorusPrabhuvaa! Devaa ! Nanu Rakshinchiyu
Nanu Karuninchiyu Neevaanigaa Nanu Chesitivi
1)Saasvata Premato Preminchitivi - Viduvaka Naa Eda Krupa Choopitivi
Tanboora Sitaara Naadanbulato - Chakkaga Ninu Sthuthinchedanu
|| Prabhuvaa ||
2)DuHkhamu Naalo Teesivesitivi - Saasvata Santoshamu Dayachesitivi
Neevu Mepedi Gorrega Nundunu - Niratamu Ninu Sthuthiyinchedanu
|| Prabhuvaa ||
3)Nadipinchitivi Prema Meeraga - Ninduga Jeeva Jalamulu Traavaga
Neeve Naaku Nitya Rakshana - Nee Yande Naa Nireekshana
|| Prabhuvaa ||
4)Santasamuto Ninu Gaanamu Cheseda - Sanghamutone Kalisi Yundedan
Praarthinchedanu Aatmala Korakai - Prakatinchedanu Nee Vaakyamunu
|| Prabhuvaa ||
5)Kanyakalu, Yauvanulu, Vruddhulu - Naatyamaaduchu Aanandinpaga
Nenu Koodanu Vaarito Nundunu - Nityamu Ninu Sthuthiyinchedanu
|| Prabhuvaa ||