Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 87

దేవ సంస్తుతి చేయవే మనసా

Deva Samsthuthi Cheyave Manasaa

♪ Mungamuru Devadas
Open in Word & Worship App
తెలుగు   దేవ సంస్తుతి చేయవే మనసా
పల్లవి
.దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ - మంతుడగు యెహోవా సంస్తుతి
చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా - జీవమా యెహోవా
దేవుని - పావన నామము నుతించుమా - నా యంతరంగము -
లొ వసించు నో సమస్తమా
1)
జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్లన్‌ మరవకు - నీవు చేసిన
పాతకంబులను - మన్నించి జబ్బు - లేవియున్‌ లేకుండ జేయును -
ఆకారణముచే
|| దేవ ||
2)
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను - గృపను -
జీవ కిరీటముగ వేయును - నీ శిరసుమిద జీవ కిరీటముగ వేయును
ఆకారణముచే
|| దేవ ||
3)
యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనె క్రొత్త యౌవనంబై
వెలయునట్లుగ - మే లిచ్చి నీదు - భావమును సంతుష్టిపరచునుగా -
ఆకారణముచే
|| దేవ ||
4)
ప్రభువు నీతి పనులు చేయున్‌ - బాధితులకు న్యాయ మిచ్చున్‌ -
విభుడు మార్గము తెలిపె, మోషేకు - దన కార్యములను - విప్పె
నిశ్రాయేలు జనమునకు - ఆకారణముచే
|| దేవ ||
5)
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుడు - నిత్యము
వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు - నీ పయి నెపుడు కోప
ముంచడు - ఆకారణముచే
|| దేవ ||
6)
పామరుల మని ప్రత్యపకార - ప్రతి ఫలంబుల్‌ పంపలేదు -
భూమికన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ భక్తి జనుల
యందున - ఆకారణముచే
|| దేవ ||
7)
పడమటికి దూర్పెంత యెడమో - పాపములకును మనకు నంత -
యెడము కలుగజేసియున్నాడు - మన పాపములను - ఎడముగానే
చేసియున్నాడు - ఆకారణముచే
|| దేవ ||
8)
కొడుకులపై దండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల యెడల
జాలిపడును దేవుండు - తన భక్తిపరుల - యెడల జాలిపడును దేవుండు
ఆకారణముచే
|| దేవ ||
9)
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి - మనము
మంటివార మంచును - జ్ఞాపకముచేసి - కొనుచు కరుణ -
జూపుచుండును ఆకారణముచే
|| దేవ ||
10)
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన-వాస పుష్పము
వలెనె నరుడుండు-నరు నాయువు తృణ-ప్రాయము మన దేవ కృప
మెండు - ఆకారణముచే
|| దేవ ||
11)
పరమ దేవా నీమంద నాజ్ఞల్ - భక్తి తో గైకొను జనులకు నిరతమును
గృప నిలిచి యుండును - యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును -
ఆకారణముచే
|| దేవ ||
English   Deva Samsthuthi Cheyave Manasaa
Chorus
Deva Sansthuthi Cheyave Manasaa - Sree - Mantudagu Yehovaa Sansthuthi
Cheyave Manasaa - Deva Sansthuthi Cheyumaa - Jeevamaa Yehovaa
Devuni - Paavana Naamamu Nutinchumaa - Naa Yantarangamu -
Lo Vasinchu No Samastamaa
1)
Jeevamaa, Yehovaa Neeku - Jesina Mellan Maravaku - Neevu Chesina
Paatakanbulanu - Manninchi Jabbu - Leviyun Lekunda Jeyunu -
Aakaaranamuche
|| Deva ||
2)
Chaavu Gotinundi Ninnu - Levanetti Dayanu - Grupanu -
Jeeva Kireetamuga Veyunu - Nee Sirasumida Jeeva Kireetamuga Veyunu
Aakaaranamuche
|| Deva ||
3)
Yauvananbu Pakshiraaju - Yauvananbu Valene Krotta Yauvananbai
Velayunatluga - Me Lichchi Needu - Bhaavamunu Santushtiparachunugaa -
Aakaaranamuche
|| Deva ||
4)
Prabhuvu Neeti Panulu Cheyun - Baadhitulaku Nyaaya Michchun -
Vibhudu Maargamu Telipe, Mosheku - Dana Kaaryamulanu - Vippe
Nisraayelu Janamunaku - Aakaaranamuche
|| Deva ||
5)
Atyadhika Prema Svaroopi-Yaina Deergha Saantaparudu - Nityamu
Vyaajyanbu Cheyadu - Aa Kruponnatudu - Nee Payi Nepudu Kopa
Munchadu - Aakaaranamuche
|| Deva ||
6)
Paamarula Mani Pratyapakaara - Prati Phalanbul Panpaledu -
Bhoomikanna Naakasanbunna - Yettundu Daiva - Prema Bhakti Janula
Yanduna - Aakaaranamuche
|| Deva ||
7)
Padamatiki Doorpenta Yedamo - Paapamulakunu Manaku Nanta -
Yedamu Kalugajesiyunnaadu - Mana Paapamulanu - Edamugaane
Chesiyunnaadu - Aakaaranamuche
|| Deva ||
8)
Kodukulapai Dandri Jaali - Padu Vidhamugaa Bhaktiparula Yedala
Jaalipadunu Devundu - Tana Bhaktiparula - Yedala Jaalipadunu Devundu
Aakaaranamuche
|| Deva ||
9)
Manamu Nirmitamayina Reeti - Tanaku Delisiyunna Sangati - Manamu
Mantivaara Manchunu - Gnaapakamuchesi - Konuchu Karuna -
Joopuchundunu Aakaaranamuche
|| Deva ||
10)
Poosi Gaali Veeva Negiri - Poyi Basanu Deliyani Vana-Vaasa Pushpamu
Valene Narudundu-Naru Naayuvu Truna-Praayamu Mana Deva Krupa
Mendu - Aakaaranamuche
|| Deva ||
11)
Parama Devaa Neemanda Naagnaal - Bhakti To Gaikonu Janulaku Niratamunu
Grupa Nilichi Yundunu - Yehovaa Neeti Taramula Pillalaku Nundunu -
Aakaaranamuche
|| Deva ||
Present