Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 868 Old No: 492

యెహోవా నీ కృప

Yehova Nee Krupa

Open in Word & Worship App
తెలుగు   యెహోవా నీ కృప
పల్లవి
నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు
నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కీర్తనలు 36:8
యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్‌ (2)
1)
తరతరములకు నీ విశ్వాస్యత - తెలియపరచెదను (2)
కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి
పాపము క్షమియించె (2)
|| యెహో ||
2)
ప్రతి శోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు (2)
నన్ను విడిపించుటకు నీవు - నమ్మ తగిన వాడవు (2)
|| యెహో ||
3)
నీదు వాత్సల్యత నాపై - నూతనముగా నుండున్‌ (2)
నీదు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్‌ (2)
|| యెహో ||
4)
నీదు రాకడ వరకు నన్ను - నిందారహితునిగా (2)
నమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు (2)
|| యెహో ||
5)
మంచి పోరాటం పోరాడి - జయమును పొందెదను (2)
మహిమ మకుటము నిచ్చెడు ప్రభువునకు
హల్లెలూయ పాడెదన్‌ (2)
|| యెహో ||
English   Yehova Nee Krupa
Chorus
Nee Mandiramu Yokka Samrddhivalana Vaaru Santrupti Nonduchunnaaru\nNee Aananda Pravaahamulonidi Neevu Vaariki Traaginchuchunnaavu.\nKeertanalu 36:8\nYehovaa Nee Krupaatisayamunu Nityamu Keertintun (2)
1)
Tarataramulaku Nee Visvaasyata - Teliyaparachedanu (2)\nKaluvari Siluva Raktamuto Nibandhana Sthiraparachi\nPaapamu Kshamiyinche (2)
2)
Prati Sodhanapai Neevu Naaku - Vijayamu Nichchedavu (2)\nNannu Vidipinchutaku Neevu - Namma Tagina Vaadavu (2)
3)
Needu Vaatsalyata Naapai - Nootanamugaa Nundun (2)\nNeedu Visvaasyata Goppadai - Maaranidai Yundun (2)
4)
Needu Raakada Varaku Nannu - Nindaarahitunigaa (2)\nNammakamaiyunna Naa Prabhuvaa - Nannu Kaachedavu (2)
5)
Manchi Poraatan Poraadi - Jayamunu Pondedanu (2)\nMahima Makutamu Nichchedu Prabhuvunaku\nHallelooya Paadedan (2)
Present