Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 863 Old No: 184

సుందర రక్షకుడా

Sundara Rakshakudaa

Open in Word & Worship App
తెలుగు   సుందర రక్షకుడా
పల్లవి
సుందర రక్షకుడా - మాదు స్వతంత్ర్యమైన దేవా
ఎల్లప్పుడు మేము నిన్నే స్తోత్రించు చుండు
స్తుతి యిదియే సుందర రక్షకుడా
1)
రాజాధిరాజా నీవే - మా షారోను రోజా నీవే - త్వరగ వత్తువనిన
గొప్పదేవుడా - నరుల మము జూడుమా
|| సు ||
2)
వ్యాధిగ్రస్తుల వైద్యుడా - యూదగోత్రమున బుట్టితి
నార్తురాలైన నాయీను విధవ - కుమారుని లేపితివి
|| సు ||
3)
రత్నవర్ణ వదనుడా - యూద - కన్య మరియ కాత్మజా
మన్నించువాడా పరమున జేర్చువాడా - మమ్ము బ్రేమ జూడుమా
|| సు ||
4)
నాకము పట్టలేని - వాడా - లోకమునకు వచ్చితీ - జీవపాన
మిచ్చి దాహము తీర్చితివి - హీనునిలో నుండుమా
|| సు ||
5)
మార్గం సత్యం జీవమై - మమ్ము కున్కక కాపాడుచు - అర
చేతిలో మమ్ము చెక్కియున్నవాడా - మంచి గొల్లబోయుడా
|| సు ||
6)
ఆశ్చర్యకరుడ నీవే - మంచి - ఆలోచన కర్తయు - బలుడైన
దేవుడ నిత్యుడగు తండ్రి - సమాధాన ప్రభువు
|| సు ||
7)
హల్లెలూయ పాడను - మహా - సత్యాత్మ వరమియను
న్యాయము తీర్చుట కేతెంచువాడా నిల్వక రా రమ్మయా
|| సు ||
English   Sundara Rakshakudaa
Chorus
Sundara Rakshakudaa - Maadu Svatantryamaina Devaa
Ellappudu Memu Ninne Stotrinchu Chundu
Sthuthi Yidiye Sundara Rakshakudaa
1)
Raajaadhiraajaa Neeve - Maa Shaaronu Rojaa Neeve - Tvaraga Vattuvanina
Goppadevudaa - Narula Mamu Joodumaa
|| Su ||
2)
Vyaadhigrastula Vaidyudaa - Yoodagotramuna Buttiti
Naarturaalaina Naayeenu Vidhava - Kumaaruni Lepitivi
|| Su ||
3)
Ratnavarna Vadanudaa - Yooda - Kanya Mariya Kaatmajaa
Manninchuvaadaa Paramuna Jerchuvaadaa - Mammu Brema Joodumaa
|| Su ||
4)
Naakamu Pattaleni - Vaadaa - Lokamunaku Vachchitee - Jeevapaana
Michchi Daahamu Teerchitivi - Heenunilo Nundumaa
|| Su ||
5)
Maargan Satyan Jeevamai - Mammu Kunkaka Kaapaaduchu - Ara
Chetilo Mammu Chekkiyunnavaadaa - Manchi Gollaboyudaa
|| Su ||
6)
Aascharyakaruda Neeve - Manchi - Aalochana Kartayu - Baludaina
Devuda Nityudagu Tandri - Samaadhaana Prabhuvu
|| Su ||
7)
Hallelooya Paadanu - Mahaa - Satyaatma Varamiyanu
Nyaayamu Teerchuta Ketenchuvaadaa Nilvaka Raa Rammayaa
|| Su ||
Present