Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 860 Old No: 47

సమస్త దేశములారా

Samasta Deshamulaaraa

Open in Word & Worship App
తెలుగు   సమస్త దేశములారా
పల్లవి
సమస్త దేశములారా - మీరెల్లరూ పాడుడి - మీరెల్లరు
సాగిలపడి - ప్రభుయేసుని కీర్తించుడి
1)
ఆయనే అల్ఫా ఓమెగయు - పాప విమోచన కర్తయును
ఆయనే మహాసుజ్ఞానియు సదా - ఆయనే దీర్ఘశాంతుండు
|| స ||
2)
విమోచన గానముతో - ఆనంద సునాదముతో - ఆయన
పరిశుద్ధ ఆవరణములో - అనవరతం స్తుతించుడిల
|| స ||
3)
ఆకాశ నివాసులలో - ఆయన పరిశుద్ధ దూతలతో భక్తుల
సమాజ సభలందున - మిక్కిలి కీర్తనీయుండు
|| స ||
4)
మన పాపంబులను భరించె - మన శాపంబులను వహించె
మనకై సిల్వలో మరణించె - మనకు రక్షణ దయచేసె
|| స ||
5)
భూరాజులు ఏలికలు - ఘనయేసుని కీర్తించుడి - భీకరుడౌ
శ్రీయేసు పదంబులు - ముద్దిడుడి ఘనంబుగను
|| స ||
6)
మనకై రక్తము చిందించి - తనతో వారసులుగ జేసె
శాశ్వత రాజ్యము మనకొసగి - పరలోక పౌరులుగను జేసెన్‌
|| స ||
English   Samasta Deshamulaaraa
Chorus
Samasta Desamulaaraa - Meerellaroo Paadudi - Meerellaru
Saagilapadi - Prabhuyesuni Keertinchudi
1)
Aayane Alphaa Omegayu - Paapa Vimochana Kartayunu
Aayane Mahaasugnaaniyu Sadaa - Aayane Deerghasaantundu
|| Sa ||
2)
Vimochana Gaanamuto - Aananda Sunaadamuto - Aayana
Parisudha Aavaranamulo - Anavaratan Sthuthinchudila
|| Sa ||
3)
Aakaasa Nivaasulalo - Aayana Parisudha Dootalato Bhaktula
Samaaja Sabhalanduna - Mikkili Keertaneeyundu
|| Sa ||
4)
Mana Paapanbulanu Bharinche - Mana Saapanbulanu Vahinche
Manakai Silvalo Maraninche - Manaku Rakshana Dayachese
|| Sa ||
5)
Bhooraajulu elikalu - Ghanayesuni Keertinchudi - Bheekarudau
Sreeyesu Padanbulu - Muddidudi Ghananbuganu
|| Sa ||
6)
Manakai Raktamu Chindinchi - Tanato Vaarasuluga Jese
Saasvata Raajyamu Manakosagi - Paraloka Pauruluganu Jesen
|| Sa ||
Present