Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 859 Old No: 43

సీయోనువాసియగు

Seeyonuvaasiyagu

Open in Word & Worship App
తెలుగు   సీయోనువాసియగు
పల్లవి
సీయోను వాసియగు - యోహోవాను స్తుతియించుడి
ఆయన చేసిన - క్రియలను కొనియాడుడి
1)
ఎఱ్ఱ సముద్రములో - ఫరోరధములను కూల్చెను
ఆరిన నేలన తన - ప్రజలను నడిపించెను
ఆహ ఆశ్చర్యకరుడాయనే - ఆహ అద్భుతకరుడాయనే
మహా దేవుండును ఆయనే
|| సీయోను ||
2)
వైరిహామానును - ఉరికంబము నెక్కించెను
వీరమొర్దెకైని - రాజు గుర్రము నెక్కించెను
|| సీయోను ||
3)
నలిగిన వారికి మహా - దుర్గము తానగును
నీతినిబట్టి నరులకు - తీర్పు తీర్చును
|| సీయోను ||
4)
పాపుల రక్షణకై - తన కొమరుని పంపెను
ప్రభుని నమ్మిన వారికి నిత్యజీవము నొసగును
|| సీయోను ||
5)
పశ్చాత్తాప్తులపై ప్రభువు - ప్రేమను చూపును
పాతాళంబునకు దుష్టుల నెట్టివేయును
|| సీయోను ||
6)
నాదు పక్షమున ప్రభువు - వ్యాజ్యమాడును
శత్రుకోటిని తాను - నిర్మూలించును
|| సీయోను ||
English   Seeyonuvaasiyagu
Chorus
Seeyonu Vaasiyagu - Yohovaanu Sthuthiyinchudi
Aayana Chesina - Kriyalanu Koniyaadudi
1)
Erra Samudramulo - Pharoradhamulanu Koolchenu
Aarina Nelana Tana - Prajalanu Nadipinchenu
Aaha Aascharyakarudaayane - Aaha Adbhutakarudaayane
Mahaa Devundunu Aayane
|| Seeyonu ||
2)
Vairihaamaanunu - Urikanbamu Nekkinchenu
Veeramordekaini - Raaju Gurramu Nekkinchenu
|| Seeyonu ||
3)
Naligina Vaariki Mahaa - Durgamu Taanagunu
Neetinibatti Narulaku - Teerpu Teerchunu
|| Seeyonu ||
4)
Paapula Rakshanakai - Tana Komaruni Panpenu
Prabhuni Nammina Vaariki Nityajeevamu Nosagunu
|| Seeyonu ||
5)
Paschaattaaptulapai Prabhuvu - Premanu Choopunu
Paataalanbunaku Dushtula Nettiveyunu
|| Seeyonu ||
6)
Naadu Pakshamuna Prabhuvu - Vyaajyamaadunu
Satrukotini Taanu - Nirmoolinchunu
|| Seeyonu ||
Present