Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 856 Old No: 607

నను ప్రేమించి ధరకేతెంచిన

Nanu Preminci Dharaketenchina

Open in Word & Worship App
తెలుగు   నను ప్రేమించి ధరకేతెంచిన
పల్లవి
నను ప్రేమించి ధరకేతించిన - యేసుని స్తుతింతున్‌
ఈ దీనుని కొరకై ప్రాణము బెట్టిన నాథుని కొనియాడుదున్‌
1)
కదిలెడు సంద్రము వలె - నా హృదయము వేదనతో నిండెన్‌
శ్రీ యేసుని మాటలు నమ్మిన తోడన్‌ - నెమ్మది నా కబ్బెన్‌
|| నను ||
2)
త్రోవను విడిచి లోయలో దిరిగెడు గొఱ్ఱెవలె నుంటిన్‌
నశించిన నన్ను వెదకియు - క్రీస్తు కృపతో రక్షించెన్‌
|| నను ||
3)
మోషే యోబు పౌలు నేను కలసి వసించెదము శ్రీ యేసుని
సన్నిధి నిత్యము మేము హల్లెలూయ పాడెదము
|| నను ||
4)
యేసుని రక్షణ నెరుగని వారికి - యెప్పుడు ప్రకటింతున్‌
శ్రీ యేసుని కొరకై హేళన హింసలు దీవెనలని ఎంతున్‌
|| నను ||
5)
మేఘము నుండి దేవుని బూర - పిలుచును నను త్వరలో
శ్రీ యేసుని నమ్మిన వారును నేను ఎత్తబడుదు మపుడు
|| నను ||
English   Nanu Preminci Dharaketenchina
Chorus
Nanu Preminchi Dharaketinchina - Yesuni Sthuthintun
Ee Deenuni Korakai Praanamu Bettina Naathuni Koniyaadudun
1)
Kadiledu Sandramu Vale - Naa Hrudayamu Vedanato Ninden
Sree Yesuni Maatalu Nammina Todan - Nemmadi Naa Kabben
|| Nanu ||
2)
Trovanu Vidichi Loyalo Dirigedu Gorrevale Nuntin
Nasinchina Nannu Vedakiyu - Kreestu Krupato Rakshinchen
|| Nanu ||
3)
Moshe Yobu Paulu Nenu Kalasi Vasinchedamu Sree Yesuni
Sannidhi Nityamu Memu Hallelooya Paadedamu
|| Nanu ||
4)
Yesuni Rakshana Nerugani Vaariki - Yeppudu Prakatintun
Sree Yesuni Korakai Helana Hinsalu Deevenalani Entun
|| Nanu ||
5)
Meghamu Nundi Devuni Boora - Piluchunu Nanu Tvaralo
Sree Yesuni Nammina Vaarunu Nenu Ettabadudu Mapudu
|| Nanu ||
Present