తెలుగు ప్రభువా స్తుతిపాత్రుడా
పల్లవిప్రభువా స్తుతిపాత్రుడా - నిరతము నిన్నే స్తుతియింతునయా
1)అల్ఫయునీవే, ఓ మేగయు నీవే - నీవే దేవుని మూర్తిమంతము
సర్వయుగములకు స్తోత్రార్హుడవు - అందుకొనుమోదేవా వందనముల్
|| ప్రభువా ||
2)నిఖిల జగంబుల నిర్మాణకుడా - నిరతము అమరత్వమున వసించుచు
నను ప్రేమించిన ప్రేమస్వరూపా - అందుకొనుమోదేవా వందనముల్
|| ప్రభువా ||
3)నశియించెడి నను వెదకి రక్షించిన - నాదు ఘోరపాపములు మన్నించిన
నీదు ప్రేమను నేనిల మరువను - అందుకొనుమోదేవా వందనముల్
|| ప్రభువా ||
4)పాపమెరుగని పావనమూర్తివి - పాపముగను నీవు చేయబడితివి
పాపిని గావను ప్రాణదానము చేసిన - యేసు నీకే వందనముల్
|| ప్రభువా ||
5)పాపదోషమును మాపగనెంచియు - చిందించితివి పావనరక్తము
కడిగితివయ్యా నా పాపములెల్ల - అందుకొనుమోదేవా వందనముల్
|| ప్రభువా ||
6)మరణించిన నను బ్రతికించితివి - కరుణతో నను నీ స్వంతము జేసితి
అనయము నాలో - ఆత్మదీపమును - వెలిగించిన ప్రభు నీకే వందనముల్
|| ప్రభువా ||
English Prabhuvaa Stuthipaatrudaa
ChorusPrabhuvaa Sthuthipaatrudaa - Niratamu Ninne Sthuthiyintunayaa
1)Alphayuneeve, O Megayu Neeve - Neeve Devuni Moortimantamu
Sarvayugamulaku Stotraarhudavu - Andukonumodevaa Vandanamul
|| Prabhuvaa ||
2)Nikhila Jaganbula Nirmaanakudaa - Niratamu Amaratvamuna Vasinchuchu
Nanu Preminchina Premasvaroopaa - Andukonumodevaa Vandanamul
|| Prabhuvaa ||
3)Nasiyinchedi Nanu Vedaki Rakshinchina - Naadu Ghorapaapamulu Manninchina
Needu Premanu Nenila Maruvanu - Andukonumodevaa Vandanamul
|| Prabhuvaa ||
4)Paapamerugani Paavanamoortivi - Paapamuganu Neevu Cheyabaditivi
Paapini Gaavanu Praanadaanamu Chesina - Yesu Neeke Vandanamul
|| Prabhuvaa ||
5)Paapadoshamunu Maapaganenchiyu - Chindinchitivi Paavanaraktamu
Kadigitivayyaa Naa Paapamulella - Andukonumodevaa Vandanamul
|| Prabhuvaa ||
6)Maraninchina Nanu Bratikinchitivi - Karunato Nanu Nee Svantamu Jesiti
Anayamu Naalo - Aatmadeepamunu - Veliginchina Prabhu Neeke Vandanamul
|| Prabhuvaa ||