తెలుగు హాలెలూయా పాడెద
పల్లవిహల్లెలూయా పాడెద\... ప్రభు నిన్ను కొనియాడెద అన్నివేళల
యందున నిన్ను పూజించు కీర్తింతును
ప్రభువా నిన్నునే కొనియాడెద హల్లెలూయ!
1)వాగ్ధానముల నిచ్చి నెరవేర్చు వాడవు నీవే
నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే
|| ప్రభువా ||
2)నాదు శత్రువులను - పడద్రోయువాడవు నీవే
మహాసమర్థ్యుండవు - నా రక్షణ శృంగము నీవే
|| ప్రభువా ||
3)ఎందరు నిన్ను చూచిరో - వారికి వెలుగు కల్గున్
ప్రభువా నేవెలుగొందితి-నా జీవంపు జ్యోతివి నీవు
|| ప్రభువా ||
4)భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు - నను సంరక్షించుచుంటివి
|| ప్రభువా ||
5)కష్టములన్నింటిని ప్రియముగ భరియింతును
నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే
|| ప్రభువా ||
6)ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన
మహిమ నీకే ఓ ప్రభూ - ఇదియే నా దీన ప్రార్థన
|| ప్రభువా ||
English Haaleluyaa Paadeda
ChorusHallelooyaa Paadeda\... Prabhu Ninnu Koniyaadeda Annivelala
Yanduna Ninnu Poojinchu Keertintunu
Prabhuvaa Ninnune Koniyaadeda Hallelooya!
1)Vaagdhaanamula Nichchi Neraverchu Vaadavu Neeve
Nammakamaina Devaa Nannu Kaapaadu Vaadavu Neeve
|| Prabhuvaa ||
2)Naadu Satruvulanu - Padadroyuvaadavu Neeve
Mahaasamarthyundavu - Naa Rakshana Srngamu Neeve
|| Prabhuvaa ||
3)Endaru Ninnu Choochiro - Vaariki Velugu Kalgun
Prabhuvaa Nevelugonditi-Naa Jeevanpu Jyotivi Neevu
|| Prabhuvaa ||
4)Bhayamunu Paaradroli - Abhayamu Nichchitivi
Ebinejaru Neevai Prabhu - Nanu Samrakshinchuchuntivi
|| Prabhuvaa ||
5)Kashtamulannintini Priyamuga Bhariyintunu
Nee Korake Jeevintunu Naa Jeevanbu Daatavu Neeve
|| Prabhuvaa ||
6)Ee Jeevita Yaatralo - emi Sanbhavinchina
Mahima Neeke O Prabhoo - Idiye Naa Deena Praarthana
|| Prabhuvaa ||