Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 852 Old No: 800

లోకమును విడచి వెళ్ళ

Lokamunu Vidachi Vella

Open in Word & Worship App
తెలుగు   లోకమును విడచి వెళ్ళ
పల్లవి
లోకమును విడచి వెళ్ళవలెనుగా - సర్వమిచ్చటనే విడువవలెను (2)
1)
యాత్రికులము ఈ దుష్ట లోకములో - పాడు లోకములో మనకేదిలేదు
ఏ విషయమందైన గర్వించలేము (2)
జాగ్రత్తగానే నడచుకొనెదము
|| లోక ||
2)
ఎంతవరకు ఈ భువియందుండెదమో - సైతానుతో సదా పోరాటమేగా
శత్రుని తంత్రాల నెరిగితిమి (2)
ధైర్యముతోనే కొనసాగెదము
|| లోక ||
3)
గతము నంతటిని మరచి పోయెదము - గురి యొద్దకానందముతో వెళ్ళెదము
మార్గాన వచ్చెటి శ్రమలనోర్చి (2)
అర్హులమౌదము బహు మానమొంద
|| లోక ||
4)
ఆత్మీయ నేత్రాలతో చూసెదము - ఎంత అద్భుతము సౌందర్య నగరం
ప్రభుని చెంతకు వెళ్ళెదము (2)
విజయోత్సవముతో ప్రవేశించెదము
|| లోక ||
English   Lokamunu Vidachi Vella
Chorus
Lokamunu Vidachi Vellavalenugaa - Sarvamichchatane Viduvavalenu (2)
1)
Yaatrikulamu Ee Dushta Lokamulo - Paadu Lokamulo Manakediledu
e Vishayamandaina Garvinchalemu (2)
Jaagrattagaane Nadachukonedamu
|| Loka ||
2)
Entavaraku Ee Bhuviyandundedamo - Saitaanuto Sadaa Poraatamegaa
Satruni Tantraala Nerigitimi (2)
Dhairyamutone Konasaagedamu
|| Loka ||
3)
Gatamu Nantatini Marachi Poyedamu - Guri Yoddakaanandamuto Velledamu
Maargaana Vachcheti Sramalanorchi (2)
Arhulamaudamu Bahu Maanamonda
|| Loka ||
4)
Aatmeeya Netraalato Choosedamu - Enta Adbhutamu Saundarya Nagaram
Prabhuni Chentaku Velledamu (2)
Vijayotsavamuto Pravesinchedamu
|| Loka ||
Present