Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 851 Old No: 780

మరణమా నీ తరణము

Maranamaa Nee Taranamu

Open in Word & Worship App
తెలుగు   మరణమా నీ తరణము
పల్లవి
మరణమా! నీ తరుణము కరుణ లేనిదాయెగా
శరణు వేడు నరుల కింత కరుణ జూపకుందువే
గరళ కంఠ మందు ప్రజల కానకుండ జేతువే
1)
మరణ జేష్టుడ నీవు - ధరణి కఠికి వాడవై
మరణ భీతుల రాజు కడకు గొఱ్ఱెల వలె యీడ్తువే
|| మరణ ||
2)
ఈ విశాల భూమి నుంటి సువిశేషమే మో వింటి
క్షేమమేదొ జూతునంచు క్షణములోనె కూలితిన్‌
|| మరణ ||
3)
మరుగు పడిరి మహితులకటా మరువ బడితి మానవులచే
తిరిగి చూచు తరుణమేది - కరుణలేని మరణము
|| మరణ ||
4)
కన్నవారిని కొన్న సతిని కన్న సుతుల నెన్నడున్‌
కానకుండ కండ్లు మూసి గంత గట్టి నావుగ
|| మరణ ||
5)
ఉన్నతిన్‌ గైకొన్న తనువు మన్ను పాలు జేతువా
ఎన్నో కోట్లు కూర్చియున్న - చిన్న చూపే చూతువా
|| మరణ ||
6)
యంత్రగాడు మంత్రగాడు వెజ్జువేల్పు లెందరో
ఎంత వింత జూపి నీదు చెంత గూలిపోయిరే
|| మరణ ||
English   Maranamaa Nee Taranamu
Chorus
Maranamaa! Nee Tarunamu Karuna Lenidaayegaa
Saranu Vedu Narula Kinta Karuna Joopakunduve
Garala Kantha Mandu Prajala Kaanakunda Jetuve
1)
Marana Jeshtuda Neevu - Dharani Kathiki Vaadavai
Marana Bheetula Raaju Kadaku Gorrela Vale Yeedtuve
|| Marana ||
2)
Ee Visaala Bhoomi Nunti Suviseshame Mo Vinti
Kshemamedo Jootunanchu Kshanamulone Koolitin
|| Marana ||
3)
Marugu Padiri Mahitulakataa Maruva Baditi Maanavulache
Tirigi Choochu Tarunamedi - Karunaleni Maranamu
|| Marana ||
4)
Kannavaarini Konna Satini Kanna Sutula Nennadun
Kaanakunda Kandlu Moosi Ganta Gatti Naavuga
|| Marana ||
5)
Unnatin Gaikonna Tanuvu Mannu Paalu Jetuvaa
Enno Kotlu Koorchiyunna - Chinna Choope Chootuvaa
|| Marana ||
6)
Yantragaadu Mantragaadu Vejjuvelpu Lendaro
Enta Vinta Joopi Needu Chenta Goolipoyire
|| Marana ||
Present