తెలుగు నీతో పొల్చుటకు సర్వేశా
పల్లవినీతో పోల్చుటకు సర్వేశా - ఎవరును లేరు ప్రకాశ
స్తుతి పాడుటకు యేసునాథా - చాలవు పదివేల నాలుకలు
1)నిజముగ యేసే మార్గము - పరమ దేవుని చేరుటకు
స్తుతులతోను పాటలతో- దేవ దేవుని చేరెదము
|| నీతో ||
2)చేతి పటములు రాళ్ళు మన్ను - మనకు దైవములు కానేరవు
ఆత్మతోను సత్యముతో - ఆరాధింతము మన దేవుని
|| నీతో ||
3)నశియించును వెండి బంగారము - లోక మాయలు గతించును
విలువైనది స్థిరమైనది - యేసు నాథుని కృపావరమే
|| నీతో ||
4)దైవసుతుడుగా అవతరించెన్ - పాపశోధనలు తొలగించెన్
నరులకై జీవమిచ్చెన్ - నశించు జనులను రక్షించెన్
|| నీతో ||
5)జీవము నిచ్చి లేచెను ప్రభువు - దేవ దేవుడు విజయుడయ్యెన్
యేసు ప్రభు- తిరిగి వచ్చున్ - సమీపించె ఆ శుభ దినము
|| నీతో ||
English Neeto Polchutaku Sarvesaa
ChorusNeeto Polchutaku Sarvesaa - Evarunu Leru Prakaasa
Sthuthi Paadutaku Yesunaathaa - Chaalavu Padivela Naalukalu
1)Nijamuga Yese Maargamu - Parama Devuni Cherutaku
Stutulatonu Paatalato- Deva Devuni Cheredamu
|| Neeto ||
2)Cheti Patamulu Raallu Mannu - Manaku Daivamulu Kaaneravu
Aatmatonu Satyamuto - Aaraadhintamu Mana Devuni
|| Neeto ||
3)Nasiyinchunu Vendi Bangaaramu - Loka Maayalu Gatinchunu
Viluvainadi Sthiramainadi - Yesu Naathuni Krupaavarame
|| Neeto ||
4)Daivasutudugaa Avatarinchen - Paapasodhanalu Tolaginchen
Narulakai Jeevamichchen - Nasinchu Janulanu Rakshinchen
|| Neeto ||
5)Jeevamu Nichchi Lechenu Prabhuvu - Deva Devudu Vijayudayyen
Yesu Prabhu- Tirigi Vachchun - Sameepinche Aa Subha Dinamu
|| Neeto ||