తెలుగు ఎన్నినాళ్ళ గమనమో
పల్లవిఎన్నినాళ్ళ గమనమో - ఎంత దూరపయనమో
ఈ ధరిత్రిలోన నీ - బ్రతుకు దినము లెన్నియో
1)గడ్డిపువ్వువంటిది - భూ నివాస జీవితం
ఎంతలోన విరియునో - అంతలోనే వాడును
|| ఎన్ని ||
2)నీటిమీద లేచిన - ఆవిరి వంటి బ్రతుకయో
క్షణముగూడ నిలువదు - గాలిలోన కలియును
|| ఎన్ని ||
3)చేదనుండి జారెడు నీటి బిందు బ్రతుకయో
జారుచున్న బిందువున్ - ఎవరితరము నిలుపగన్
|| ఎన్ని ||
4)త్రాసుమీద ధూళిలా - ఎగిరిపోవు జీవితం
కలలుకన్న జీవితం - కలసిపోయె నేలలో
|| ఎన్ని ||
5)నీటిమీద తేలినా - బుడగవంటి బ్రతుకయో
ఎపుడు పగలిపోవునో - ఏ నరునకు తెలియదు
|| ఎన్ని ||
6)యేసే సత్యమార్గము - యేసే నిత్యజీవము
యేసుని నమ్మువారికి - నిత్యజీవమొసగును
|| ఎన్ని ||
7)నిత్యజీవమున్నది - నీకు యేసు యిచ్చును
మారుమనసు పొందుము - ప్రభునిచెంత చేరుము
|| ఎన్ని ||
English Enninaallu Gamanamoo
ChorusEnninaalla Gamanamo - Enta Doorapayanamo
Ee Dharitrilona Nee - Bratuku Dinamu Lenniyo
1)Gaddipuvvuvantidi - Bhoo Nivaasa Jeevitam
Entalona Viriyuno - Antalone Vaadunu
|| Enni ||
2)Neetimeeda Lechina - Aaviri Vanti Bratukayo
Kshanamugooda Niluvadu - Gaalilona Kaliyunu
|| Enni ||
3)Chedanundi Jaaredu Neeti Bindu Bratukayo
Jaaruchunna Binduvun - Evaritaramu Nilupagan
|| Enni ||
4)Traasumeeda Dhoolilaa - Egiripovu Jeevitam
Kalalukanna Jeevitan - Kalasipoye Nelalo
|| Enni ||
5)Neetimeeda Telinaa - Budagavanti Bratukayo
Epudu Pagalipovuno - e Narunaku Teliyadu
|| Enni ||
6)Yese Satyamaargamu - Yese Nityajeevamu
Yesuni Nammuvaariki - Nityajeevamosagunu
|| Enni ||
7)Nityajeevamunnadi - Neeku Yesu Yichchunu
Maarumanasu Pondumu - Prabhunichenta Cherumu
|| Enni ||