తెలుగు పరలోకము నా దేశము
పల్లవిపరలోకము నా దేశము
పరదేశి నేనిల, మాయలోకమేగా - నేను యాత్రికుడను
1)ఎంతో అందమైనది పరలోకము - అసమానమైనది నా దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును
|| పర ||
2)దూతలు పాడుచుందురు, పరమందున
దివారాత్రములందు పాడుచుందురు
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము
|| పర ||
3)రక్షకుని చెంతకు, యెప్పుడేగెదన్ - వీక్షించెదనెప్పుడు నాదు ప్రియుని
కాంక్షించెద నా మదిలో, ఆయన చెంతనుండ
|| పర ||
4)అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్ - అగుపడుచున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను, పరిశుద్ధులెల్లరిన్
|| పర ||
5)నిత్యానందముండును, పరమందున - నీతి సమాధానము, ఉండునచ్చట
పొందెదను విశ్రాంతిని, శ్రమలన్నియు వీడి
|| పర ||
English Paralokamu Naa Desamu
ChorusParalokamu Naa Desamu
Paradesi Nenila, Maayalokamegaa - Nenu Yaatrikudanu
1)Ento Andamainadi Paralokamu - Asamaanamainadi Naa Desamu
Ellappudu Visvaasamuto Yaatranu Saagintunu
|| Para ||
2)Dootalu Paaduchunduru, Paramanduna
Divaaraatramulandu Paaduchunduru
Paavanuni Choochi Nenu Harshintunu Nityamu
|| Para ||
3)Rakshakuni Chentaku, Yeppudegedan - Veekshinchedaneppudu Naadu Priyuni
Kaankshincheda Naa Madilo, Aayana Chentanunda
|| Para ||
4)Addariki Eppudu Nenu Velledan - Agupaduchunnadi Gamyasthaanamu
Achchatane Choochedanu, Parisuddhulellarin
|| Para ||
5)Nityaanandamundunu, Paramanduna - Neeti Samaadhaanamu, Undunachchata
Pondedanu Visraantini, Sramalanniyu Veedi
|| Para ||