Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 844 Old No: 223

ఉన్నత గృహమును

Unnatha Gruhamunu

Open in Word & Worship App
తెలుగు   ఉన్నత గృహమును
పల్లవి
ఉన్నత గృహమును త్వరగా చేరి - సంపన్నుని దర్శింతున్‌
ఈ సేదగు నాకోర్కె సఫలముచేసిన - నాధుని కొనియాడుదున్‌
1)
దూతల మధ్య స్తోత్రము లొందెడు - ప్రభువుని స్తోత్రింతున్‌
సుగంధము వీచెడి పుష్పరాజంబుల మధ్యను విశ్రమింతున్‌
|| ఉ ||
2)
ఆకాశగణములు సేవించుచుండగ - వీక్షతోవారి జేరుదున్‌
నా యేసుని స్తుతుల నోరారపాడి - భాసురముగ స్తుతింతున్‌
|| ఉ ||
3)
స్ఫటిక నది తీరమున నేను - పాడుచు తిరుగుదును
ఆ బంగరు వీధిలో యేసుతో - నేను రంగుగ నడుగిడుదున్‌
|| ఉ ||
4)
పక్షులు అయ్యెడ అనేకముండును - వృక్షఫలములుండున్‌
నా రక్షకుడగు యేసు నాకై చేర్చిన - అక్షయ ధనముండున్‌
|| ఉ ||
5)
పేతురు యోహాను పౌలుతో నేనును - ప్రీతితో వసియింతున్‌
నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో - హల్లెలూయ పాడెదన్‌
|| ఉ ||
English   Unnatha Gruhamunu
Chorus
Unnata Gruhamunu Tvaragaa Cheri - Sanpannuni Darsintun
Ee Sedagu Naakorke Saphalamuchesina - Naadhuni Koniyaadudun
1)
Dootala Madhya Stotramu Londedu - Prabhuvuni Stotrintun
Sugandhamu Veechedi Pushparaajanbula Madhyanu Visramintun
|| U ||
2)
Aakaasaganamulu Sevinchuchundaga - Veekshatovaari Jerudun
Naa Yesuni Stutula Noraarapaadi - Bhaasuramuga Sthuthintun
|| U ||
3)
Sphatika Nadi Teeramuna Nenu - Paaduchu Tirugudunu
Aa Bangaru Veedhilo Yesuto - Nenu Ranguga Nadugidudun
|| U ||
4)
Pakshulu Ayyeda Anekamundunu - Vrukshaphalamulundun
Naa Rakshakudagu Yesu Naakai Cherchina - Akshaya Dhanamundun
|| U ||
5)
Peturu Yohaanu Pauluto Nenunu - Preetito Vasiyintun
Naa Challani Mitruni Intanu Harshamuto - Hallelooya Paadedan
|| U ||
Present