Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 843 Old No: 216

సీయోను పాటలు

Seeyonu Paatalu

Open in Word & Worship App
తెలుగు   సీయోను పాటలు
పల్లవి
సీయోను పాటలు సంతోషముగ - పాడుచు సీయోను వెళ్ళెదము
1)
లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీలోకము నందు - కొంతకాల మెన్నో శ్రమలు
|| సీ ||
2)
ఐగుప్తును విడచినట్టి మారు - అరణ్యవాసులే యీ ధరలో
నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు క్రీస్తేసుపై నిల్పుడి
|| సీ ||
3)
మారాను పోలిన చేదైన స్థలముల - ద్వారా పోవలసియున్న నేమి
నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాట నమ్ము
|| సీ ||
4)
ఐగుప్తు ఆశలన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి
|| సీ ||
5)
ఆనందమయ పరలోకంబు మనది - అక్కడనుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభు యేసుకు జై
|| సీ ||
English   Seeyonu Paatalu
Chorus
Seeyonu Paatalu Santoshamuga - Paaduchu Seeyonu Velledamu
1)
Lokaana Saasvataanandamemiyu - Ledani Cheppenu Priyudesu
Pondavale Neelokamu Nandu - Kontakaala Menno Sramalu
|| See ||
2)
Aiguptunu Vidachinatti Maaru - Aranyavaasule Yee Dharalo
Nityanivaasamu Ledilalona - Netraalu Kreestesupai Nilpudi
|| See ||
3)
Maaraanu Polina Chedaina Sthalamula - Dvaaraa Povalasiyunna Nemi
Nee Rakshakundagu Yese Nadupunu - Maarani Tanadu Maata Nammu
|| See ||
4)
Aiguptu Aasalanniyu Vidichi - Ranguga Yesuni Venbadinchi
Paadaina Korahu Paapanbumaani - Vidheyulai Viraajilludi
|| See ||
5)
Aanandamaya Paralokanbu Manadi - Akkadanundi Vachchunesu
Seeyonu Geetamu Sonpuga Kalasi - Paadedamu Prabhu Yesuku Jai
|| See ||
Present