తెలుగు ప్రియ యేసు రాజను నే
పల్లవిప్రియ యేసు రాజును నే చూచిన చాలు - మహిమలో
నేనాయనతో నుంటే చాలు - నిత్యమైన మోక్ష గృహము
నందు చేరి - భక్తుల - గుంపులో హర్షించిన చాలు
1)యేసుని రక్తమందు కడుగబడి - వాక్యముచే నిత్యం
భద్రపరచబడి - నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను
బంగారు వీధులలో తిరిగెదను
|| ప్రియ ||
2)దూతలు వీణెలను మీటునపుడు - గంభీర జయధ్వనులు
మ్రోగినపుడు - హల్లెలూయ పాటలు పాడుచుండ
ప్రియ యేసుతోను నేను యుల్లసింతున్
|| ప్రియ ||
3)ముండ్లమకుటంబైన తలను జూచి - స్వర్ణకిరీటంబెట్టి
యానందింతున్ - కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
ప్రతి యొక్క గామమును చుంబింతును
|| ప్రియ ||
4)హృదయము స్తుతులతో నింపబడె - నా భాగ్య గృహమును
స్మరించుచుంటె - హల్లెలూయ ఆమెన్ హల్లెలూయా - వర్ణింప
నా నాలుక చాలదయ్యా
|| ప్రియ ||
5)ఆహా యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా నాయాశ
యెపుడు తీరుతుందో - తండ్రి నా కన్నీటిని తుడుచునెపుడో
ఆశతో వేచియుండే నా హృదయం
|| ప్రియ ||
English Priya Yesu Raajanu Ne
ChorusPriya Yesu Raajunu Ne Choochina Chaalu - Mahimalo
Nenaayanato Nunte Chaalu - Nityamaina Moksha Gruhamu
Nandu Cheri - Bhaktula - Gunpulo Harshinchina Chaalu
1)Yesuni Raktamandu Kadugabadi - Vaakyamuche Nityam
Bhadraparachabadi - Nishkalanka Parisuddhulato Pedan Nenu
Bangaaru Veedhulalo Tirigedanu
|| Priya ||
2)Dootalu Veenelanu Meetunapudu - Ganbheera Jayadhvanulu
Mroginapudu - Hallelooya Paatalu Paaduchunda
Priya Yesutonu Nenu Yullasintun
|| Priya ||
3)Mundlamakutanbaina Talanu Joochi - Svarnakireetanbetti
Yaanandintun - Koradaato Kottabadina Veepun Joochi
Prati Yokka Gaamamunu Chunbintunu
|| Priya ||
4)Hrudayamu Stutulato Ninpabade - Naa Bhaagya Gruhamunu
Smarinchuchunte - Hallelooya Aamen Hallelooyaa - Varninpa
Naa Naaluka Chaaladayyaa
|| Priya ||
5)Aahaa Yaa Boora Yepudu Dhvaninchuno - Aahaa Naayaasa
Yepudu Teerutundo - Tandri Naa Kanneetini Tuduchunepudo
Aasato Vechiyunde Naa Hrudayan
|| Priya ||