తెలుగు దేవా మా గృహంబును
పల్లవిదేవా, మా గృహంబును - సదయుండవై - దీవించుటకు
రారమ్ము నీవే యిద్దానిని నెఱదాతవగుచు స-ద్భావముతో
నిచ్చితిని బహుమానముగ మాకు
1)మా యింటి యజమానుండ - నీవెసుమ్మి - మా యింటి ప్రభుఁడ
వీవె - పాయక మా యింట - భవదీయాభీష్టంబె
శ్రేయోదాయకమగుచు సిద్ధించెడును గాక
|| దేవా ||
2)మా యాస్తిపాస్తులన్ని - మాకబ్బె భవ - దీయానుగ్రహబలముచే
నీ యాననవ్వాని - నీ యలఘు సేవకై - న్యాయముగ
నర్పింప నీయవే ఘన బుద్ధి
|| దేవా ||
3)నీవిచ్చు ధననిధులైన - మా బిడ్డలు - కేవలము నీ దాసులై
భావివావిరి మణులు - ఠేవనుద్భాసిల్ల - నీవెవారిని భృశము
ప్రోవమాయువొసంగి
|| దేవా ||
4)లేపుమాపి గృహమునఁ బ్రోక్తములగుచు - దీవించు ప్రార్థన
ముల - లోపరహితంబులుగా - ధూపధూమములట్లు -
నీపాదయుగళి - సమీపింప నిమ్మెపుడు
|| దేవా ||
English Devaa Maa Gruhambuunu
ChorusDevaa, Maa Gruhanbunu - Sadayundavai - Deevinchutaku
Raarammu Neeve Yiddaanini Neradaatavaguchu Sa-Dbhaavamuto
Nichchitini Bahumaanamuga Maaku
1)Maa Yinti Yajamaanunda - Neevesummi - Maa Yinti Prabhunda
Veeve - Paayaka Maa Yinta - Bhavadeeyaabheeshtanbe
Sreyodaayakamaguchu Siddhinchedunu Gaaka
|| Devaa ||
2)Maa Yaastipaastulanni - Maakabbe Bhava - Deeyaanugrahabalamuche
Nee Yaananavvaani - Nee Yalaghu Sevakai - Nyaayamuga
Narpinpa Neeyave Ghana Buddhi
|| Devaa ||
3)Neevichchu Dhananidhulaina - Maa Biddalu - Kevalamu Nee Daasulai
Bhaavivaaviri Manulu - Thevanudbhaasilla - Neevevaarini Bhrusamu
Provamaayuvosangi
|| Devaa ||
4)Lepumaapi Gruhamunan Broktamulaguchu - Deevinchu Praarthana
Mula - Loparahitanbulugaa - Dhoopadhoomamulatlu -
Neepaadayugali - Sameepinpa Nimmepudu
|| Devaa ||