తెలుగు దీవించుమో దేవా ధరయందు
పల్లవిదీవించుమో దేవా - ధరయందు -ఈ గృహమున్
దీవించియును - కాపాడుమయా నీ దివ్య సన్నిధిని
1)జక్కయ్య ఇంటివలె - చక్కని రక్షణతో
మిక్కిలి ఆనంద సునాదములు - పెక్కుగ వినబడగ
|| దీవి ||
2)యోహాను తల్లియగు - మరియ గృహమువలెను
బరలోకమును కదిలించినట్టి - ప్రార్థన గృహముగను
|| దీవి ||
3)ఓబెదెదొము గృహమువలె - ఆశీర్వాదము నొందును
నిజదేవునిదౌ నివాసముగ - నిత్యము విలసిల్లగ
|| దీవి ||
4)పరిశుద్ధక యందున - ప్రతివిధమగు పరిచర్యలో
పరిపూర్ణతను మరి కలిగియుండి - పరమందున ఫలమొందగ
|| దీవి ||
5)ఆది పితరుడైన - అబ్రహాము గృహమువలె
అన్నిటియందు ఆదర్శముగ - అవనిలో ఫలియింపగా
|| దీవి ||
English Deevinchamo Devaa Dharayandu
ChorusDeevinchumo Devaa - Dharayandu -Ee Gruhamun
Deevinchiyunu - Kaapaadumayaa Nee Divya Sannidhini
1)Jakkayya Intivale - Chakkani Rakshanato
Mikkili Aananda Sunaadamulu - Pekkuga Vinabadaga
|| Deevi ||
2)Yohaanu Talliyagu - Mariya Gruhamuvalenu
Baralokamunu Kadilinchinatti - Praarthana Gruhamuganu
|| Deevi ||
3)Obededomu Gruhamuvale - Aaseervaadamu Nondunu
Nijadevunidau Nivaasamuga - Nityamu Vilasillaga
|| Deevi ||
4)Parisudhaka Yanduna - Pratividhamagu Paricharyalo
Paripoornatanu Mari Kaligiyundi - Paramanduna Phalamondaga
|| Deevi ||
5)Aadi Pitarudaina - Abrahaamu Gruhamuvale
Annitiyandu Aadarsamuga - Avanilo Phaliyinpagaa
|| Deevi ||